నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన

నిరుద్యోగ యువతను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు..

Update: 2024-10-24 17:24 GMT

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగ యువతను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరువూరులో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ జగన్ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని, తిరువూరు నియోజకవర్గంలో 4, 5 సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ పొంది పోటీ పరీక్షలకు రెడీ కావాలని యువత, నిరుద్యోగులకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. 


Similar News