వైఎస్ షర్మిలకు నోటీసులు.. జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

ఆస్తుల వివాదంతో వైఎస్ జగన్ కోర్టు ద్వారా పంపిన నోటీసులపై వైఎస్ షర్మిల స్పందించారు...

Update: 2024-10-24 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్(Saraswati Power and Industries Private Limited) వాటాల పంపకం విషయంలో మాజీ సీఎం జగన్(Former CM Jagan), ఆయన సొదరి వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జగన్ దాఖలు చేసిన పిటిషన్‌తో వైఎస్ షర్మిల, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma)తో పాటు పలువురికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(National Company Law Tribunal) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్‌తో విభేదాలపై మాట్లాడారు. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమేనని చెప్పారు. కానీ అందరూ అమ్మలపై, చెల్లెళ్లపై కోర్టుల్లో కేసులు వేయరు కదా? అని, ఇలా కోర్టుకు లాగరు కదా? అని షర్మిల ప్రశ్నించారు. కుటుంబ సమస్యలపై అమ్మ మీదే కేసు వేసిన వ్యక్తి జగన్ అని షర్మిల వ్యాఖ్యానించారు. 


Similar News