లాఠీ పట్టిన టీపీవో..
దిశ, కరీంనగర్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలపై కొరడా ఝులిపించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి పోలీసుల డ్యూటీ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులను మరిపించేలా హల్చల్ చేశారు. రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి కారణాలు తెలుసుకోకుండానే తాళం చెవి లాక్కుని వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో పట్టణ ప్రజలు అవాక్కాయ్యారు. అయితే, అందరికీ కరోనా జాగ్రత్తలు చెప్పిన ఆయన మాత్రం.. నిబంధనలు పాటించలేదు. మొహానికి మాస్కు, చేతులకు గ్లౌజులు లేకుండానే […]
దిశ, కరీంనగర్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలపై కొరడా ఝులిపించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి పోలీసుల డ్యూటీ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులను మరిపించేలా హల్చల్ చేశారు. రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి కారణాలు తెలుసుకోకుండానే తాళం చెవి లాక్కుని వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో పట్టణ ప్రజలు అవాక్కాయ్యారు. అయితే, అందరికీ కరోనా జాగ్రత్తలు చెప్పిన ఆయన మాత్రం.. నిబంధనలు పాటించలేదు. మొహానికి మాస్కు, చేతులకు గ్లౌజులు లేకుండానే వాహనాలను ఆపడం పలు విమర్శలకు దారి తీసింది. ఏది ఏమైనా మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. పోలీసు విభాగం లేదా ఆర్టీవో అధికారులు మాత్రమే తీసుకోవల్సిన చర్యలను టీపీవో తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.
Tags: town planning officer, tpo, siricilla, police duty, lockdown, siricilla tpo, ktr, corona