బెల్ట్ జోరు.. కుటుంబాలు బేజారు..

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మద్యం వ్యాపారం కొనసాగుతోంది.

Update: 2024-12-25 03:42 GMT

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మద్యం వ్యాపారం కొనసాగుతోంది. బెల్ట్ దుకాణాల్లో సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధిత అధికారుల అండ ఉండడంతో అడ్డూ అదుపు లేకుండా నడుస్తోంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి పట్టణంలోని ఒక షాపు నుంచి బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. ఒక సీసా మీద మద్యం వ్యాపారులు రూ.20 అదనంగా తీసుకుంటుండగా, బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో రూ.20 కలిపి రూ.40 అదనంగా తీసుకొని మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపులో యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు మద్యం వ్యాపారులు ప్రైవేట్ సైన్యంతో బెల్ట్ షాపులను తనిఖీ చేస్తున్నారు. మద్యం సీసాల పై వీరికి సంబంధించిన ముద్రను వేస్తూ సంతకాలు చేస్తున్నారు. గ్రామాల్లో కిరాణా షాపులు, హోటళ్లు పేరుకే ఉన్నప్పటికీ లోపల తతంగమంతా మద్యం విక్రయాలే నడిపిస్తున్నారు. మద్యం విక్రయంతో పాటు అక్కడ తాగేందుకు బెంచీలు, కుర్చీలు వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం ప్రియుల కోసం వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్‌ను క్షణాల్లో అందిస్తుండడంతో వారు ఈ బెల్ట్ దుకాణాల్లో మద్యం సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారులు వీటిని ఆసరాగా చేసుకుని ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అన్ని ఏర్పాట్లతో దర్జాగా విక్రయాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పచ్చని సంసారాల్లో బెల్ట్ దుకాణాలు చిచ్చు పెడుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ దుకాణాల పై అధికారులు కొరడా జులిపించాలని పలువురు కోరుతున్నారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మద్యం వ్యాపారం కొనసాగుతోంది. బెల్ట్ దుకాణాల్లో సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధిత అధికారుల అండ ఉండడంతో అడ్డూ అదుపు లేకుండా నడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు దందాను పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి పట్టణంలోని ఒక షాపు నుంచి బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నారు. ఒక సీసా మీద మద్యం వ్యాపారులు రూ.20 అదనంగా తీసుకుంటుండగా, బెల్ట్ షాపు నిర్వాహకులు మరో రూ.20 కలిపి రూ.40 అదనంగా తీసుకొని మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపులో యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు మద్యం వ్యాపారులు ప్రైవేట్ సైన్యంతో బెల్ట్ షాపులను తనిఖీ చేస్తున్నారు.

మద్యం సీసాల పై వీరికి సంబంధించిన ముద్రను వేస్తూ సంతకాలు చేస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం, గ్రామాలతో కలిపి 9 మద్యం షాపులు ఉన్నాయి. అయితే ఈ దుకాణాలు తెరవక ముందే, మూసిన తర్వాత మద్యం ప్రియులు అంతా బెల్టు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో కిరాణా షాపులు, హోటళ్లు పేరుకే ఉన్నప్పటికీ లోపల తతంగమంతా మద్యం విక్రయాలే నడిపిస్తున్నారు. మద్యం విక్రయంతో పాటు అక్కడ తాగేందుకు బెంచీలు, కుర్చీలు వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం ప్రియుల కోసం వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్‌ను క్షణాల్లో అందిస్తుండడంతో వారు ఈ బెల్ట్ దుకాణాల్లో మద్యం సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారులు వీటిని ఆసరాగా చేసుకుని ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అన్ని ఏర్పాట్లతో దర్జాగా విక్రయాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎనీ టైం మద్యం..

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణకు సమయపాలనలో నిబంధన ఉంది. ఈ నిబంధనల ప్రకారం దుకాణాన్ని తొందరగా తెరవడం, ఆలస్యంగా మూయడం వంటివి చేయొద్దు. కానీ ఎనీ టైం మద్యం దొరికేది ఒక బెల్టు దుకాణాల్లోనే. మద్యం దుకాణాలు ఉన్న ప్రాంతంలో వాటిని మూయగానే బెల్టు దుకాణాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లో వీటి ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దుకాణాల్లో అదనంగా సీసాకు రూ.40 వసూలు చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది గ్రామాల్లో ఈ అక్రమ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇబ్బంది పడుతున్న మహిళలు...

గ్రామాల్లో అక్రమంగా వెలిసిన బెల్ట్ దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం సేవించిన మత్తులో బెల్టు దుకాణాల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. యువత, ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారు. ఈ బెల్టు దుకాణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్ట్ దుకాణాలు చిచ్చు పెడుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ దుకాణాల పై అధికారులు కొరడా జులిపించాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారు.

యువత పై తీవ్ర ప్రభావం.. కోయల్ కార్ శ్యామ్, జిల్లా వైస్ చైర్మన్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్

గ్రామాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యువత మద్యానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చెడు మార్గాల వైపు వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం మద్యం తాగి నడపడమే కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశం ఉంది.


Similar News