చలో హైదరాబాద్ విజయవంతం చేయండి.. టీపీటీఫ్

సమగ్ర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Update: 2024-12-25 09:00 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమగ్ర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సమగ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం 23 ఏండ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బందికి కనీస వేతనం చట్టం అమలు జేసి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలీచాలని జీతంతో జీవితాలను వెళ్లదీస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలన్నారు.

ఆరోగ్య కార్డులు అమలు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. కేజీబీవీ ప్రత్యేక అధికారులకు ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతల నుండి తప్పించాలని, గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సెలవులు అనుమతించాలన్నారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసే పద్ధతిని రద్దు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలన్నింటిని పరిష్కరించి, 18 రోజులుగా వారు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో జిల్లా నుండి పెద్ద మొత్తంలో హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా సమగ్ర సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుమాల రామ్నాథ్ రెడ్డి, జిల్లా, మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News