రాజన్న ఆలయ ప్రాంగణంలో అపచారం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది.

Update: 2024-12-25 13:03 GMT

దిశ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరిదో పుట్టిన రోజు సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్లొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోకి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

    విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసాహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయ ప్రాంగణంలోకి గుట్టుచప్పుడు కాకుండా మాంసాహారం వచ్చినప్పటికీ ఆలయ యంత్రాంగం గమనించకపోవడం పట్ల స్థానిక ప్రజలతో పాటు బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఆలయ ఈఓతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


Similar News