బ్లాక్ ఫంగస్ విజృంభణ.. ఇప్పటివరకు దేశంలో ఎన్ని కేసులంటే?

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,500 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా.. 126 మంది మృతి చెందారు. ప్రధానంగా మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే బ్లాక్ ఫంగస్ వల్ల 90 మంది మరణించారు. కొన్ని రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలను నమోదు చేయడం లేదు. దీంతో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలకు సంబంధించి సరైన డేటా అందుబాటులో లేదు. అటు బ్లాక్ […]

Update: 2021-05-21 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,500 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా.. 126 మంది మృతి చెందారు. ప్రధానంగా మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే బ్లాక్ ఫంగస్ వల్ల 90 మంది మరణించారు.

కొన్ని రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలను నమోదు చేయడం లేదు. దీంతో బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలకు సంబంధించి సరైన డేటా అందుబాటులో లేదు. అటు బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా గుర్తించి అత్యవసర చికిత్స అందించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News