చికెన్‌తో పోటీపడుతోన్న టమాట
దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే వంట నూనె, పప్పుల ధరలు కొంత మేర పెరగగా.. తాజాగా కూరగాయలు ధరలు కూడా పెరిగాయి. నిన్నటి వరకు రూ.20 ఉన్న ధర ప్రస్తుతం రూ.70లకు చేరింది. ఈక్రమంలో టమాటా, ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. మొన్నటి వరకు కిలో రూ.20 ఉన్న టమాట.. సోమవారం ఏకంగా కిలో రూ.68 పలికింది. వారం రోజుల క్రితం రూ.100లకు 5 కిలోలు వచ్చిన ఉల్లిగడ్డ ప్రస్తుతం […]
దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే వంట నూనె, పప్పుల ధరలు కొంత మేర పెరగగా.. తాజాగా కూరగాయలు ధరలు కూడా పెరిగాయి. నిన్నటి వరకు రూ.20 ఉన్న ధర ప్రస్తుతం రూ.70లకు చేరింది. ఈక్రమంలో టమాటా, ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. మొన్నటి వరకు కిలో రూ.20 ఉన్న టమాట.. సోమవారం ఏకంగా కిలో రూ.68 పలికింది. వారం రోజుల క్రితం రూ.100లకు 5 కిలోలు వచ్చిన ఉల్లిగడ్డ ప్రస్తుతం రూ.50లకు చేరింది. పెరిగిన ధరలతో సామాన్యుడు కూరగాయలు కూడా కొనేస్థితిలో లేరు. వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడంతోనే కూరగాయల ధరలకు రెక్కలొచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు చికెన్ ధరలు కూడా దిగిరావడం లేదు. గత రెండు నెలలుగా రూ.230 నుంచి రూ.280 వరకు చికెన్ ధరలు కొనసాగుతున్నాయి. తాజాగా చికెన్ సరసాన టమాట చేరిందనడంలో సందేహం లేదేమో.