'ఏజెంట్' లుక్ : హాలీవుడ్ హీరోలా అక్కినేని అందగాడు.. ఈసారైనా
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో హిట్ కోసం ఎదురుచూసే హీరోల్లో మెయిన్ గా చెప్పుకొనే హీరో ఎవరు అంటే అక్కినేని హీరో అఖిల్ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం చేస్తున్న అఖిల్ పట్టు వదలని విక్రమార్కుడిలా మారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో డీసెంట్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈ హీరో తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో హిట్ కోసం ఎదురుచూసే హీరోల్లో మెయిన్ గా చెప్పుకొనే హీరో ఎవరు అంటే అక్కినేని హీరో అఖిల్ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం చేస్తున్న అఖిల్ పట్టు వదలని విక్రమార్కుడిలా మారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో డీసెంట్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈ హీరో తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ కోసం లుక్ మొత్తం మార్చేశాడు. ఇప్పటికే ‘ఏజెంట్’ కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మరో లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో అక్కినేని అందగాడు ఎనిమిది పలకల దేహంతో కనిపించి అభిమానులను షాక్ కి గురిచేశాడు. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని దర్శకుడు ఇదివరకే చెప్పాడు. ఇక ఈ పోస్టర్స్ చూస్తుంటే అది నిజమే అని తెలుస్తోంది. ఇక ఈ కండలు తిరిగిన దేహం కోసం అఖిల్ 365 రోజులు గట్టి కసరత్తులు చేశాడు.
ఈ విషయాన్ని అఖిల్ తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ “365 రోజుల క్రితం సురేందర్ రెడ్డి కి మాట ఇచ్చాను. మెంటల్ గా, ఫిజికల్ గా మారతానని.. మీరు చెప్పిన విధంగానే మారాను. సర్, మీరు నాలో మండించిన అగ్ని ఈ చిత్రం ద్వారా కోపంగా కాలిపోతుంది. నేను మీకు మాట ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా నేటి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదిఏమైనా అఖిల్ బాడీ ని చూస్తుంటే హాలీవుడ్ హీరో గుర్తొస్తున్నాడని కొందరు.. టాలీవుడ్ టైగర్ ష్రాఫ్ నువ్వే అన్న.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రాలతో అఖిల్ హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.