బాలీవుడ్ వైపు ‘సంకల్ప్’ అడుగులు
దిశ, వెబ్‌డెస్క్: సంకల్ప్ రెడ్డి..టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఘాజీ, అంతరిక్షం లాంటి డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభ అతని సొంతం. ఘాజీ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కగా, అంతరిక్షం..అంతరిక్షయానానికి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ రెండు సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌కు కూడా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ డైరెక్టర్..ప్రస్తుతం బాలీవుడ్‌పై […]
దిశ, వెబ్‌డెస్క్: సంకల్ప్ రెడ్డి..టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఘాజీ, అంతరిక్షం లాంటి డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభ అతని సొంతం. ఘాజీ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కగా, అంతరిక్షం..అంతరిక్షయానానికి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ రెండు సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌కు కూడా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు.
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ డైరెక్టర్..ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిపెట్టాడు. యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. కమాండో ఫ్రాంచైజ్‌తో పాపులర్ అయిన ఈ హీరో తండ్రి ఓ ఆర్మీ ఆఫీసర్. సంకల్ప్ రెడ్డి సినిమాల గురించి విన్న ఆయన..తన కొడుకు కోసం రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని యాక్షన్ డ్రామాతో కూడిన కథ రాయాలని కోరారట. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్న సంకల్ప్ ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమా వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం.