టోక్యో ఒలింపిక్స్‌కు భారత షూటర్లు.. వారి వారసులు అయ్యేదెవరు..?

దిశ, స్పోర్ట్స్: భారత ఒలింపిక్ చరిత్రలో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన మొదటి వ్యక్తి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో వెండి పతకం సాధించాడు. ఇక ఆ తర్వాత జరిగిన 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మరో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటి వరకు టీమ్ ఈవెంట్లలో కాకుండా వ్యక్తిగతంగా స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ కొల్లగొట్టిన అభినవ్ […]

Update: 2021-07-14 07:22 GMT

దిశ, స్పోర్ట్స్: భారత ఒలింపిక్ చరిత్రలో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన మొదటి వ్యక్తి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో వెండి పతకం సాధించాడు. ఇక ఆ తర్వాత జరిగిన 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మరో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటి వరకు టీమ్ ఈవెంట్లలో కాకుండా వ్యక్తిగతంగా స్వర్ణం సాధించిన ఏకైక అథ్లెట్ అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ కొల్లగొట్టిన అభినవ్ బింద్ర భారత్ ఖాతాలో స్వర్ణం లేని లోటును తీర్చాడు. అప్పటి నుంచి మరో రెండు ఒలింపిక్స్ జరిగినా ఒక్క స్వర్ణ పతకం కూడా మన ఖాతాలో చేరలేదు.

2012 లండన్ ఒలింపిక్స్‌లో వినయ్ కుమార్ షూటింగ్‌లో రజత పతకం, నారంగ్ కాంస్య పతకం సాధించారు. ఇలా వరుసగా మూడు సార్లు మనకు షూటర్లే పతకాలు తెచ్చిపెట్టారు. కానీ గత 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం షూటర్లు నిరాశే మిగిల్చారు. ఇండియా నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్తున్న 118 మంది అథ్లెట్లలో 15 మంది షూటర్లే ఉన్నారు. ఈ సారి బలమైన టీమ్‌ను భారత షూటింగ్ ఫెడరేషన్ ఒలింపిక్స్‌కు పంపుతున్నది. గత కొంత కాలంగా అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న షూటర్లలో ఎంత మంది బింద్రా, నారంగ్‌ల వారసులుగా మిగులుతారో అని యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.

అంత సులభం కాదు..!

షూటింగ్ అనేది మిగిలిన ఆటల కంటే చాలా భిన్నమైనది. అసలు ఎవరు గెలుస్తారనేది ముందుగా ఊహించడం కష్టమే. ఈ ఆటలో శారీరిక శక్తి కంటే మానసికంగా ధృడంగా ఉండటం ముఖ్యం. ఒక షూటర్ ఎంత మంచి ఫామ్‌లో ఉన్నా ప్రతీ సారి పర్ఫెక్ట్‌గా 10 పాయింట్లు స్కోర్ చేయడం కష్టమే. టోక్యో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 360 మంది షూటర్లు తొలి రౌండ్ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో అన్ని క్రీడలకంటే ముందు ప్రారంభమయ్యేది షూటింగ్ పోటీలే. షూటింగ్‌లో ఉన్న 15 విభాగాలకు తొలుత క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్ విభాగంలో టాప్ 8, షాట్‌గన్ విభాగంలో టాప్ 6 మంది తర్వాత రౌండ్లకు ఎంపికవుతారు. అలా ప్రతీ రౌండ్‌లో కొంత మందిని తగ్గించుకుంటూ వచ్చి.. ఫైనల్‌లో టాప్ 3 షూటర్లు పోటీ పడతారు. ఒకసారి ఫైనల్ చేరుకున్న తర్వాత ఎవరైనా గెలిచే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సాధారణ ప్రదర్శన చేసిన షూటర్‌కు స్వర్ణం రావొచ్చు. మంచిగా రాణిస్తున్న వ్యక్తి పతకం కోల్పోవచ్చు. అందుకే ప్రతీ షూటర్ మానసికంగా ప్రశాంతంగా ఉంటే కానీ పతకం సాధించలేడని కోచ్‌లు చెబుతున్నారు.

వీళ్లు పతకం కొట్టే అవకాశం..

వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5 ర్యాంకులో ఉన్న పిస్టల్ టీమ్‌ను భారత్ టోక్యో ఒలింపిక్స్‌కు పంపిస్తున్నది. 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో తప్పకుండా ఇండియాకు పతకం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, మను బాకర్, యశస్విని సింగ్ దేశ్వాల్, 25 మీటర్ల స్పోర్స్ పిస్టల్‌లో రాహీ సర్ణోబాద్. మను బాకర్ పోటీ పడనున్నారు. 2019, 2021 షూటింగ్ వరల్డ్ కప్లో వీళ్లందరూ ఫైనల్స్ చేరుకున్నారు. మను బాకర్ ఈ సారి మూడు ఈవెంట్లలో తలపడనున్నది. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ టీమ్ కూడా బలంగా కనిపిస్తున్నది. వీరిలో ఒకరు తప్పకుండా పతకం కొడతారనే నమ్మకం ఉన్నది. 2019 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో ఇండియాలో 42 పతకాలు వచ్చాయి. వీటిలో 14 గోల్డ్ మెడల్స్ వరల్డ్ కప్‌లోనే సాధించడం విశేషం. రైఫిల్ టీమ్‌లో అపూర్వి చండీలా ఇటీవల నిలకడగా రాణిస్తున్నది. 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లలో ఐశ్వరి ప్రతాప్ సింగ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత షూటర్లు గత కొన్ని నెలలుగా క్రొయేషియాలో కఠినమైన శిక్షణ పొంది వచ్చారు. కేవలం ఆటకు సంబంధించే కాకుండా మెంటల్ హెల్త్ ట్రైనింగ్ కూడా అయ్యారు. ఒలింపిక్స్ వంటి వేదికపై ఒత్తిడికి గురవకుండా వీళ్ళు నిలకడగా రాణించడానికి తగినంత శిక్షణ పొందారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

షూటింగ్ :

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ – అంజుమ్ ముద్గిల్, తేజశ్విని సావంత్

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – అపూర్వి చండేలా, ఎలవెనిల్ వాలారివా

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – మనూ భాకర్, యశస్విని దేశ్వాల్

మహిళల 25 మీటర్ల పిస్టల్ – మనూ భాకర్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – దివ్యాంన్ష్ పన్వార్, దీపక్ కుమార్

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ – సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – సౌరభ్ ఛౌదరి, అభిషేక్ వర్మ

పురుషుల స్కీట్ – అంగద్ వీర్ సింగ్ భజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్

మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లు..

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – దివ్యాంన్ష్ సింగ్ పన్వార్ – ఎలవెనిల్ వాలారివా, దీపక్ కుమార్ – అంజుమ్ ముద్గిల్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – సౌరభ్ చౌదరి-మను భాకర్, అభిషేక్ వర్మ-యశస్విని సింగ్ దేశ్వాల్

Tags:    

Similar News