టాయ్‌లెట్ పేపర్ ఎమర్జెన్సీ.. ఆదుకున్న న్యూస్ పేపర్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వైరస్ భయం కారణంగా ఇంట్లో నుంచి వెళ్లకూడదని ముందే సూపర్ మార్కెట్లకు వెళ్లి సరుకులు కొనేసుకుంటున్నారు. అందులో భాగంగా టాయ్‌లెట్ పేపర్ కూడా కొనేశారు. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాలో టాయ్‌లెట్ పేపర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. కంపెనీలు ఉత్పత్తిని వేగవంతం చేసినప్పటికీ చేరాల్సిన చోటికి త్వరగా టాయ్‌లెట్ పేపర్ డెలివరీ కావడం లేదు. దీంతో ఆస్ట్రేలియన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే […]

Update: 2020-03-07 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వైరస్ భయం కారణంగా ఇంట్లో నుంచి వెళ్లకూడదని ముందే సూపర్ మార్కెట్లకు వెళ్లి సరుకులు కొనేసుకుంటున్నారు. అందులో భాగంగా టాయ్‌లెట్ పేపర్ కూడా కొనేశారు. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాలో టాయ్‌లెట్ పేపర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. కంపెనీలు ఉత్పత్తిని వేగవంతం చేసినప్పటికీ చేరాల్సిన చోటికి త్వరగా టాయ్‌లెట్ పేపర్ డెలివరీ కావడం లేదు. దీంతో ఆస్ట్రేలియన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

అయితే వారిని కాపాడటానికి స్థానిక వార్తాపత్రిక ఒకటి రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు తమదైన శైలి హెడ్‌లైన్లతో అక్కడి అందరి మనసులు దోచుకున్న ఎన్‌టీ న్యూస్ పేపర్ తమ రీడర్లకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్చి 5వ తారీఖు నాటి ఎడిషన్‌లో 8 పేజీల ఖాళీ పేపర్ ప్రింట్ చేయించింది. ఈ 8 పేజీలను అత్యవసర పరిస్థితుల్లో టాయ్‌లెట్ పేపర్‌గా వాడుకోవాలని హెడ్‌లైన్‌లో ప్రచురించింది. తమది రీడర్ల మనసును, అవసరాలను, ఇబ్బందులను అర్థం చేసుకునే న్యూస్ పేపర్ అని ఎడిటర్ మ్యాట్ విలియమ్స్ అన్నారు. కోల్స్, వూల్‌వర్త్ లాంటి సూపర్ మార్కెట్లు తమ దగ్గర టాయ్‌లెట్ పేపర్ స్టాక్ లేదని బోర్డు పెట్టడం చూసి ఈ ఆలోచన వచ్చిందని మ్యాట్ చెప్పారు.

Tags: Toilet Paper Emergency, Corona fear, Australia, NT news, Print toilet paper, Rescue

Tags:    

Similar News