వ్యాక్సిన్‌ సీసాలతో ‘షాండ్లియర్’.. ఆమె కళాకృతికి నెటిజన్లు ఫిదా

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొవడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతిలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిలిచిన నర్సులే, పౌరులకు వ్యాక్సినేషన్ ఇవ్వడంలోనూ తమ సేవలను అందిస్తున్నారు. అయితే కొలరాడోకు చెందిన లారా వీస్ అనే నర్స్ ఖాళీ వ్యాక్సిన్ సీసాలను బయటపడేయకుండా, వాటితో ఓ అందమైన ‘షాండ్లియర్’ రూపొందించింది. లారా దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, ఆమె సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతేకాదు వ్యాక్సిన్ వయెల్స్‌తో […]

Update: 2021-09-07 05:24 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొవడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతిలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిలిచిన నర్సులే, పౌరులకు వ్యాక్సినేషన్ ఇవ్వడంలోనూ తమ సేవలను అందిస్తున్నారు. అయితే కొలరాడోకు చెందిన లారా వీస్ అనే నర్స్ ఖాళీ వ్యాక్సిన్ సీసాలను బయటపడేయకుండా, వాటితో ఓ అందమైన ‘షాండ్లియర్’ రూపొందించింది. లారా దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, ఆమె సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతేకాదు వ్యాక్సిన్ వయెల్స్‌తో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్‌ను ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’‌గా అభివర్ణిస్తున్నారు.

కొలరాడోకు చెందిన లారా వీస్.. బౌల్డర్ కౌంటీలోని పబ్లిక్ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో నర్సుగా పనిచేస్తోంది. బౌల్డర్ కౌంటీ నివాసితులకు టీకాలు వేయడంలో సహాయపడిన హెల్త్‌కేర్ వర్కర్స్, వాలంటీర్ల కృషికి తన ప్రశంసలను చూపించడానికి ఖాళీ కొవిడ్ వ్యాక్సిన్ సీసాలతో షాండ్లియర్ రూపొందించాలనుకుంది. దాన్ని తయారుచేసి ఆ కళాకృతిని తమ హెల్త్ కమ్యూనిటీలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ‘మా ప్రతిభావంతులైన పబ్లిక్ హెల్త్ నర్సులలో ఒకరైన లారా వీస్, ఈ అందమైన కళాకృతిని సృష్టించారు. అమెకు మా అందరి తరఫున కృతజ్ఞతలు’ అంటూ బౌల్డర్ కౌంటీ పబ్లిక్ హెల్త్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

‘కొవిడ్ సమయం నుంచి హెల్త్ వర్కర్స్ తీరికలేకుండా గడుపుతున్నారు. పౌరులకు టీకాలు వేయడంలో వారి కృషి మరవలేనిది. ఎంతోమంది ప్రాణాలు నిలపడంలో మేమంతా భాగమయ్యాం. వాలంటీర్లు కూడా తమ వంతు సాయం అందించారు. ఈ యజ్ఞంలో సాయపడిన అందరినీ గౌరవించడం, ప్రశంసించడం అవసరం. అందుకే వారికి చిరు ప్రశంస ఇవ్వాలనుకున్నాను. వందల సంఖ్యలో ఖాళీగా ఉన్న టీకా సీసాలు వృథా కావడం, వాటితో మాకో కనెక్షన్ ఉండటంతో వాటితో ఓ అర్థవంతమైన కళాకృతి చేయాలనుకున్నాను. అందుకే ఈ షాండ్లియర్‌ రూపొందించాను. ఎంతో నష్టం, అనిశ్చితి, ఆందోళన తర్వాత.. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ కాంతి ఆశను తెస్తుంది. అందుకే దీన్ని ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’‌‌గా పేర్కొంటున్నాను – లారా

Tags:    

Similar News