రేవంత్ అరెస్ట్ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు లేఖ
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. డ్రోన్ కేసులో రేవంత్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజకీయ కారణాలతోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. అక్రమ అరెస్టుపై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్‌కు బెయిల్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జ్యోతిమణి.. చురుకైన […]
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. డ్రోన్ కేసులో రేవంత్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజకీయ కారణాలతోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. అక్రమ అరెస్టుపై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్‌కు బెయిల్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జ్యోతిమణి.. చురుకైన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ యూత్ లీడర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. రాహుల్ గాంధీ అనుచరుల్లో ఈమె ఒకరు.
tag; revanth reddy arrest issue, loksabha, speaker, mp jyothimani