ఎమ్మెల్యే ‘వివేక్’ భార్యకు భారీ షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే భార్యకే దొంగలు టోకరా వేశారు. పక్కా ప్లాన్‌తో లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, ఐఫోన్‌ను నొక్కేశారు. దీంతో సదరు మహిళ తెల్లముఖం వేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా న్యూ ఢిల్లీలోని లోధి కాలనీలోని ఓ హోటల్‌లో కొన్ని రోజుల నుంచి ఉంటున్నారు. ఈ క్రమంలో […]

Update: 2021-07-24 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే భార్యకే దొంగలు టోకరా వేశారు. పక్కా ప్లాన్‌తో లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, ఐఫోన్‌ను నొక్కేశారు. దీంతో సదరు మహిళ తెల్లముఖం వేయాల్సి వచ్చింది.

వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా న్యూ ఢిల్లీలోని లోధి కాలనీలోని ఓ హోటల్‌లో కొన్ని రోజుల నుంచి ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం(జులై 23) మధ్యాహ్నం వివేక్‌ భార్య కారులో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో 2.15 గంటల సమయంలో డిఫెన్స్‌ కాలనీ ఫ్లైఓవర్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు బైకుపై కారు వెనుకే ఫాలో అయ్యారు. కొద్ది దూరం వచ్చాక.. కారు టైరును చూపిస్తూ డ్రైవర్‌కు వారు ఏదో సైగ చేశారు.

అయితే, కారు గ్లాస్ డోర్లు క్లోజ్ చేసి ఉండటంతో వారు చెప్పింది డ్రైవర్‌కు అర్థం కాలేదు. వెంటనే కారును పక్కన ఆపిన డ్రైవర్.. కారు దిగి టైరు పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై వచ్చి కారు బోనోట్‌ వైపు చూపించారు. దీంతో, డ్రైవర్‌ కారు టైరు దగ్గర నుంచి లేచి బోనోట్‌ దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో కారులో నుంచి ఎమ్మెల్యే వివేక్‌ భార్య కిందకు దిగారు.

అదే అదనుగా సదరు బైకర్స్ కారులో ఉన్న రెండు లక్షల మనీ, I Phone, Gold కాయిన్‌తో పాటు అక్కడే ఉన్న కొన్ని డాక్యుమెంట్స్‌ను కొట్టేశారు. ఈ తతంగం అంతా క్షణాల్లో జరిగిపోవడంతో సదరు మహిళకు ఏం జరిగిందో తెలిసే లోపే వారు అక్కడి నుంచి జారుకున్నారు. జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే భార్య పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News