టిక్‌టాక్ ఆల్టర్నేట్ యాప్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ ఎంత పాపులర్ అయినా.. ఎక్కువగా అడిక్ట్ అయ్యింది మాత్రం ఇండియన్సే. టిక్‌టాక్‌లో 119 మిలియన్ల యాక్టివ్ ఇండియన్ యూజర్లు ఉండటమే అందుకు నిదర్శనం. డేటా ప్రైవసీ కారణంగా భారత్.. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించడంతో ప్రస్తుతం ఆల్టర్నేట్ యాప్‌లపై టిక్‌టాకర్ల దృష్టి పడింది. దీంతో దేశీ యాప్‌ల హవా పెరిగింది. టిక్‌టాక్ పాపులారిటినీ సొంతం చేసుకోవడానికి ఇన్‌స్టా కూడా రేసులోకి వచ్చింది. తాజాగా ‘రీల్స్’ ఫీచర్‌తో […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ ఎంత పాపులర్ అయినా.. ఎక్కువగా అడిక్ట్ అయ్యింది మాత్రం ఇండియన్సే. టిక్‌టాక్‌లో 119 మిలియన్ల యాక్టివ్ ఇండియన్ యూజర్లు ఉండటమే అందుకు నిదర్శనం. డేటా ప్రైవసీ కారణంగా భారత్.. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించడంతో ప్రస్తుతం ఆల్టర్నేట్ యాప్‌లపై టిక్‌టాకర్ల దృష్టి పడింది. దీంతో దేశీ యాప్‌ల హవా పెరిగింది. టిక్‌టాక్ పాపులారిటినీ సొంతం చేసుకోవడానికి ఇన్‌స్టా కూడా రేసులోకి వచ్చింది. తాజాగా ‘రీల్స్’ ఫీచర్‌తో షార్ట్ వీడియోలకు అవకాశం కల్పించడంతో సెలబ్రిటీలంతా.. రీల్స్‌కు క్యూ కట్టారు. ఇక యూట్యూబ్ కూడా అదే తరహా ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. అసలు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఏమేం యాప్స్ ఉన్నాయో? తెలుసుకుందాం.
మోజ్: లోకల్ లాంగ్వేజ్‌లో పాపులర్ అయిన యాప్స్‌లో ‘షేర్ చాట్’ ముందు వరసలో ఉంటుంది. షేర్‌చాట్ నిర్వాహకులు తాజాగా టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘మోజ్’ యాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో 15 భారతీయ భాషలను ఉపయోగించుకోవచ్చు. కాగా, ఈ యాప్ విడుదలైన రెండు వారాల్లోనే మోజ్ యాప్ 10 మిలియన్లకు మించి డౌన్‌లోడ్స్ సాధించుకుంది. టిక్‌టాక్‌లో ఉన్నటువంటి షార్ట్ వీడియోలు, స్పెషల్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, ఎమోటికన్స్ అన్నీ ఇందులోనూ ఉంటాయి. 15 సెకన్ల డ్యూరేషన్ ఉన్న వీడియోలను ఫిల్టర్లు, ఎమోట్స్‌తో బ్యూటిఫై చేసుకుని అప్‌లోడ్ చేసే అవకాశంతో పాటు లిప్ సింకింగ్ ఫంక్షనాలిటీ కూడా ఇందులో ఉంది.
మిత్రోన్ : ఇది కూడా టిక్‌టాక్ లాంటి ‘షార్ట్ వీడియో షేరింగ్’ యాపే. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోఎస్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఈ యాప్ ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. ఈ యాప్ కూడా ప్లేస్టోర్‌లో 10 మిలియన్స్ ప్లస్ డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది.
చింగారీ: ఈ యాప్ ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే కోటికి పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. టిక్‌టాక్‌లానే ఇందులోనూ వీడియోలు షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు టిక్ టాక్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎలా మనీ ఎర్న్ చేస్తారో.. చింగారీ యాప్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు కంటెంట్ క్రియేటర్స్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కంటెంట్‌కు వచ్చిన వ్యూస్ ఆధారంగా మనీ ఎర్న్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు, ఆ దిశగా యాప్‌ను డెవలప్ చేస్తున్నట్లు చింగారీ యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
రోపోసో: గురుగ్రామ్‌కు చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ‘రోపోసో’. 2014లో ఈ యాప్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉంది. నెలకు 80 వేలకు పైగా వీడియోలు క్రియేట్ అవుతున్నాయి. ఇటీవల రెండు రోజుల్లోనే ఏకంగా 22 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ యాప్ 5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్స్ చేసుకున్నారు.
తెలంగాణ చట్‌పట్: టిక్‌టాక్ ఆల్టర్నేట్‌గా తెలంగాణ నుంచి వచ్చిన యాప్.. చట్ పట్. దీనిని వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ చట్‌పట్ యాప్‌కు రూపకల్పన చేశారు. శ్రీనివాస్ ఇదివరకు ఏడు యాప్‌లను రూపొందించినప్పటికీ వాటికి సరైన స్పందన రాలేదు. టిక్ టాక్‌పై బ్యాన్ విధించడంతో.. చట్‌పట్‌కు రూపకల్పన చేశాడు. ఈ యాప్ జూన్ 29న ప్లేస్టోర్ వేదికపైకి వచ్చింది.
హాట్‌షాట్స్: మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌తో బాగా పాపులర్ అయిన యాప్ ‘గానా’. వీళ్ల నుంచి కూడా టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘హాట్‌షాట్స్’ సోషల్ మీడియా వీడియో ప్లాట్‌ఫామ్ ఇటీవలే వచ్చింది. వీడియోలు, సక్సెస్ స్టోరీలు క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయొచ్చని గానా చెబుతోంది. ఇప్పటికే హాట్‌షాట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు మ్యూజిక్, కామెడీ, డ్యాన్స్ వీడియోలను ‘హాట్‌షాట్ ఛాలెంజెస్’ పేరుతో అప్‌లోడ్ చేస్తున్నారు. గానా హాట్‌షాట్స్‌లో రియాజ్ అలీ, అవ్నీత్ కౌర్, నేహా కక్కర్, దర్శన్ రావల్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.
ఎంఎక్స్ టకాటక్: ఎమ్ఎక్స్ ప్లేయర్.. టిక్‌టాక్‌ను పోలిన ‘టకాటక్’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఫన్నీ వీడియోలను వీక్షించడతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసుకోవచ్చు. డైలాగ్, డబ్బింగ్, కామెడీ, గేమింగ్, డీఐవై, ఫుడ్, స్పోర్ట్స్, మీమ్స్.. ఇలా అన్ని తరహా వీడియోలను ఇందులో బ్రౌజ్ చేసుకోవచ్చు. యాప్‌లో షార్ట్ ఫన్ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ మూవీ డైలాగ్స్‌ను డబ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ ప్లాట్‌ఫాముల్లోనూ షేర్ చేసుకోవచ్చు.
ట్రెల్( trell), బోలో ఇండియా, రిజిల్ (rizzle), లిట్ లాట్(litlot)లు కూడా టిక్‌టాక్ ఆల్టర్నేట్ యాప్‌లే. అదే విధంగా జీ5 కూడా టిక్‌టాక్‌ను పోలిన యాప్‌ను ‘హైపై’(hipi) పేరుతో జులై 15న లాంచ్ చేయనుంది.