MakeMyTrip: మల్టీ-కరెన్సీ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభించిన మేక్ మై ట్రిప్
దీనివల్ల అంతర్జాతీయ టూరిస్టులకు దేశవ్యాప్తంగా సరఫరా నెట్‌వర్క్‌కు నేరుగా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ టూరిస్టుల కోసం సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దేశీయంగా పర్యాటక రంగ అభివృద్ధికి మల్టీ-కరెన్సీ చెల్లింపుల సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ సొమవారం ప్రకటనలో వెల్లడించింది. దీనివల్ల అంతర్జాతీయ టూరిస్టులకు దేశవ్యాప్తంగా సరఫరా నెట్‌వర్క్‌కు నేరుగా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుందని, తద్వారా 2,100 నగరాల్లో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా దేశీయంగా పర్యటించే విదేశీయులు తమకు అవసరమైన కరెన్సీతో చెల్లింపులు పూర్తి చేయవచ్చని మేక్ మై ట్రిప్ సహ-వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో చెప్పారు. కంపెనీ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించి బహ్రెయిన్ దినార్, బ్రిటిష్ పౌండ్, యూరో, అమెరికా డాలర్‌తో సహా ప్రధాన గ్లోబల్ కరెన్సీలను ఉపయోగించే చెల్లింపులు జరుగుతాయని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.