టిక్‌టాక్‌తో టీనేజర్స్‌కు రిస్క్.. సూసైడ్ చేసుకునే అవకాశం: పరిశోధకులు

టిక్‌టాక్ టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? మానసిక రుగ్మతలకు కారణమవుతుందా?

Update: 2022-12-19 11:59 GMT

దిశ, ఫీచర్స్: టిక్‌టాక్ టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? మానసిక రుగ్మతలకు కారణమవుతుందా? అంటే.. అవుననే అంటున్నారు పరిశోధకులు. ఈ విధమైన అంశాలను తెలుసుకోవడానికి టిక్‌టాక్ అల్గారిథమ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన పరిశోధకులు.. అతి కొద్ది నిమిషాల్లోనే టీనేజర్లను ప్రభావితం చేసిందని, క్రూరత్వ ఆలోచనలు, సూసైడ్ చేసుకోవాలనే ప్రేరణను కలిగించిందని గుర్తించారు.

నాన్ ప్రాఫిట్ సంస్థ సెంటర్ ఫర్ కౌంటరింగ్ హేట్ (Center for Countering Digital Hate-CCDH) నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. రీసెర్చ్‌లో భాగంగా ఈ సంస్థ దాదాపు 13 ఏళ్ల వయస్సుగల పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ (యూఎస్), యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన చిన్నారులపై పరిశోధనలు చేసింది. సాధారణ ఖాతాదారుల మాదిరిగా ఎనిమిది అకౌంట్ క్రియేట్ చేసి పరిశీలించింది. కాగా ఓ కంటెంట్‌ను పోస్ట్ చేసిన పరిశోధకులు 3 నిమిషాలకంటే తక్కువ వ్యవధిలోనే ఆందోళనకరమైన రిజల్ట్‌ను గుర్తించారు.

టిక్ టాక్ చెడు వ్యసనాలు, మానసిక రుగ్మతులకు కారణమవుతోందని, పరోక్షంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ వీడియోలను వీక్షించిన టీనేజర్స్‌లో ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మానసిక బలహీనత వంటి ఆందోళనకరమైన అంశాలు బయటపడినట్టు వెల్లడించింది. ఈ ప్రయోగం తర్వాత 'స్వయంగా హాని చేసుకునేందుకు ప్రభావితం అవుతున్నారా?' అనే విషయాన్ని పరిశీలించే ఉద్దేశంతో మరో కంటెంట్‌ను పరిశోధకులు టిక్‌టాక్ యాప్‌లో ప్రమోట్ చేయగా భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. మోడల్స్ బాడీ షేప్స్‌ను, రేజర్ బ్లేడ్స్‌‌తో ఆత్మహత్యలపై కంటెంట్‌ను టీనేజర్స్ వీక్షించడం, లైక్ చేయడం, చర్చించడం వంటివి చేస్తున్నారని.. ఇది చాలా డేంజరస్ అని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ నివేదికను ప్రకటించిన సీసీహెచ్‌డీ సీఈవో ఇమ్రాన్ అహమ్మద్ మాట్లాడుతూ.. 'టీనేజర్లు- సోషల్ మీడియా ప్రభావం'పై నిర్వహించిన పరిశోధనలో పేరెంట్స్‌ను ఆందోళనకు గురిచేసే అంశాలున్నాయి. సోషల్ మీడయా పిల్లల్ని వ్యసనపరులుగా, మానసిక బలహీనులుగా, క్రూరత్వంగా మార్చే అవకాశం ఉంది. క్రమంగా వారి శారీరక అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. పిల్లలు సోషల్ మీడియా వ్యసనానికి గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తమ పిల్లల్ని తామే చంపుకున్నవారవుతారు' అని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాలను టిక్ టాక్ యాజమాన్యం తోసిపుచ్చింది.

READ MORE

తుపాకీ బుల్లెట్‌‌ను ఆపగలిగే సరికొత్త శరీర కవచం..! 

Tags:    

Similar News