sperm count: స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఈ సమస్యలు కూడా ఓ కారణమే..!

ప్రస్తుత రోజుల్లో పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి.

Update: 2024-12-22 16:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి. పిల్లల్ని కనేందుకు ఆసుపత్రుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే సంతానలేమి సమస్యలకు కారణం స్మెర్మ్ కౌంట్ తగ్గిపోవడం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. హ్యూమన్‌ రిప్రొడక్షన్‌ అప్‌డేట్ జర్నల్‌లో ప్రచురించిన దాన్ని బట్టి చూస్తే.. ముఖ్యంగా 45 ఏళ్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ సగానికి పైగా తగ్గుతుందని వెల్లడైంది. అలాగే స్మెర్మ్ కౌంట్ తగ్గడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే అది స్మెర్మ్ కౌంట్ పై ఎఫెక్ట్ చూపిస్తుందట. అలాగే కాలుష్యం, వీటితో పాటుగా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ధూమపానం వల్ల పురుషుల స్మెర్మ్ కౌంట్ తగ్గుతుందట. అంతేకాకుండా వరికోసెల్ అనే వ్యాధితో బాధపడేవారిలో కూడా స్మెర్స్ కౌంట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ప్రైవేటు పార్ట్స్ లో ఇన్ఫెక్షన్, డయాబెటిస్, గోనేరియా వంటి రోగాలతో బాధపడేవారిలో, ప్రోస్టేట్ సమస్య, హైపోథైరాయిడిజం, డిప్రెషన్, లివర్, అల్సర్ సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కూడా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. కాగా పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ పెరగాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని.. నాణ్యమైన పుడ్ తీసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News