Dishti: దిష్టి తీసిన వస్తువులు తొక్కితే చెడు శక్తి వెంటాడుతుందా? దీనిలో నిజమెంత?

అప్పటి నుంచి వారిలో రక రకాల నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి

Update: 2024-12-23 05:01 GMT
Dishti: దిష్టి తీసిన వస్తువులు తొక్కితే చెడు శక్తి వెంటాడుతుందా? దీనిలో నిజమెంత?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : హిందూ సంప్రదాయాలలో ఆచారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం ఉదయం లేవగానే తల స్నానం చేసి దేవుడికి దీపం వెలిగిస్తాము. ఇవన్ని ఎలా నిష్ఠగా పాటిస్తామో .. "దిష్టి తీయడం" కూడా అంతే విధంగా ఆచరిస్తూ ఉంటాము. చెడు ప్రభావాలు, దృష్టులు నీడ పడకుండా ఉండటానికి దిష్టి తీయడం జరుగుతుంది.

దిష్టి తీసిన తర్వాత వాటిని కొందరు రోడ్డుపైనే పడేస్తుంటారు. అయితే, తెలిసి తెలియక చాలామంది తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఈ తొక్కడం వెనుక కూడా కొన్ని విశ్వాసాలున్నాయి. దిష్టిని ఎరుపు మిరపకాయలు, నిమ్మకాయలు, కర్పూరం, ఎరుపు వస్త్రాలు వంటి వస్తువులను ఉపయోగించి చెడు శక్తి పారిపోయేలా చేస్తారు. అయితే, కొన్ని సార్లు రోడ్లు, ఇంటి పరిసర ప్రాంతాల్లో పడేస్తారు. అయితే, చాలా మంది రోడ్డుపై పడేసిన వాటిని తొక్కడాన్ని చెడుగా భావిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక గురించి ఇక్కడ తెలుసుకుందాం..

రోడ్డుపై దిష్టి తీసిన వస్తువులను తొక్కితే చెడు జరుగుతుందని ఒక విశ్వాసం. వాటిని చెడు శక్తులుగా అనుకుంటారు , కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళమని పెద్దలు చెబుతారు. వీటిని తొక్కిన దగ్గర నుంచి ఏ చిన్న తప్పు జరిగినా దీని వల్లే అని భావిస్తారు. ఇక అప్పటి నుంచి వారిలో రక రకాల నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. నిమ్మకాయలను తొక్కడం వలనే ఇలా కీడు జరిగిందనే భావన చాలా మందిలో భయాన్ని కలిగిస్తుంది. కానీ, వీటిలో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా మానసిక భ్రమా అని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News