Pregnant women: గర్భిణీలు దీని లివర్ తినొచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు!
ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో మహిళలకు ఫుడ్ తీసుకునే విషయంలో చాలా సందేహాలు తలెత్తుతుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో మహిళలకు ఫుడ్ తీసుకునే విషయంలో చాలా సందేహాలు తలెత్తుతుంటాయి. ఏ ఆహారం తీసుకుంటే ప్రయోజనాలు? నష్టాలు? అంటూ వైద్యుల సలహాలు తీసుకుంటారు. తాజాగా గర్భిణీలు మటన్ లివర్(mutton liver) తినొచ్చా లేదా అనే దానిపై వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అధిక పోషకాలు ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మహిళలు మటన్ లివర్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు. మటన్ లివర్ తింటే శిశువు పెరుగుదల(Baby growth)పై ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే పిండంలోని కేంద్ర నాడీ వ్యవస్థ(central nervous system), క్రానియోఫేషియల్(Craniofacial), హార్ట్‌లో పుట్టుకతో వచ్చే లోపాలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.
ఈ లివర్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. యూఎస్‌డీఏ(USDA) ప్రకారం చూసినట్లైతే.. ప్రెగ్నెన్సీ మహిళలకు విటమిన్ ఏ 8 వేల ఐయూ అవసరమని పేర్కొంది. వంద గ్రాముల చికెన్ లివర్ లోనే 11, 100 ఐయూ విటమిన్ ఏ ఉండగా..మటన్ లివర్‌లో మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. కాగా లివర్‌కు బదులుగా బీన్స్(Beans), లీన్ మీట్(lean meat), బచ్చలికూర(spinach), తృణ ధాన్యాలు(whole grains), ఫోలెట్(folate) అధికంగా ఉన్న సిట్రస్ పండ్లు(Citrus fruits), ఆకు కూరలు(leafy vegetables), బీన్స్(beans), ధాన్యాలు(grains).. విటమిన్ బి ౧(Vitamin) కు పుష్కలంగా ఉన్న మాంసం(Meat), చేపలు(fish), గుడ్లు(eggs), తీసుకుంటే ప్రెగ్నెన్సీ మహిళలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కడుపులోని బిడ్డకు మేలని సూగర్భిణీలు దీని లివర్ తినొచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు!చిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More...
Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. ఈ మిస్టేక్స్ చేస్తే అంతే సంగతి