Phone addiction: పిల్లలు ఫోన్ చూస్తూ తింటే ఎదుర్కొనే సమస్యలు
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజెంట్ డేస్‌లో చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు అడక్ట్ అవుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజెంట్ డేస్‌లో చాలా మంది స్మార్ట్ ఫోన్(Smart phone)కు అడక్ట్ అవుతున్నారు. తిండి, నిద్ర పక్కన పెట్టి ఫోన్లలోనే కాలం గడిపేస్తున్నారు. చివరకు తినేటప్పుడు కూడా చేతిలో మొబైల్ ఉంటేనే తింటున్నారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి చేటు అని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఫోన్ చూస్తూ తినడం వల్ల పోషకాహార లోపం(Malnutrition)తో పాటు ఊబకాయ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏడ్చినా సరే ఈ అలవాటు మాన్పించకపోతే మాత్రం అనేక రోగాలు దరిచేరుతాయని అంటున్నారు.
పిల్లలు ఫోన్ చూస్తూ ఫుడ్ తీసుకుంటే జీర్ణక్రియ(digestion) బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఫోన్‌లో లీనమై.. అతిగా తింటుంటారు. దీంతో ఊబకాయం(obesity) సమస్య తలెత్తుతుంది. అలాగే ఫోన్ చూసే క్రమంలో పిల్లలు ఆహారం నమలకుండా మింగుతారు. ఫలితంగా జీర్ణక్రియ వీక్ అవుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ దరిచేరుతాయి. అలాగే కళ్లపై ప్రభావం పడుతుంది.
అంతేకాకుండా పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లల సామర్థ్యంపై దెబ్బతీస్తుంది. మొబైల్ చూస్తు ఫుడ్ తినడం కారణంగా మానసిక సమస్యలు(Psychological problems) కూడా తలెత్తుతాయి. బరువు పెరగరు. కాగా భోజనం చేసేటప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు తినేటప్పుడు తరచూ గమనిస్తూ పక్కన ఉండటం మేలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.