పశువుపై దాడి చేసిన పెద్దపులి.. ఆ తర్వాత అడవిలోకి!

దిశ, బెజ్జూర్ : కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌‌లో పెద్దపులి కదలికలు మళ్లీ ప్రారంభమవడంతో స్థానికులు భయాందోళనకు గురవున్నారు. జిల్లాలోని పెంచికలపేట అటవీ ప్రాంతంలో పులి కదలికలను అధికారులు గుర్తించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి తరచూ సంచరిస్తుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పెంచికలపేట బెజ్జూర్ ప్రధాన రహదారిపై వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కూడా ఎక్కడ పులి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. బుధవారం బెజ్జూర్ మండలం ఏల్లూరు గ్రామానికి చెందిన పశువుపై పెంచికలపేట […]

Update: 2021-10-13 04:49 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌‌లో పెద్దపులి కదలికలు మళ్లీ ప్రారంభమవడంతో స్థానికులు భయాందోళనకు గురవున్నారు. జిల్లాలోని పెంచికలపేట అటవీ ప్రాంతంలో పులి కదలికలను అధికారులు గుర్తించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి తరచూ సంచరిస్తుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పెంచికలపేట బెజ్జూర్ ప్రధాన రహదారిపై వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కూడా ఎక్కడ పులి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.

బుధవారం బెజ్జూర్ మండలం ఏల్లూరు గ్రామానికి చెందిన పశువుపై పెంచికలపేట అడవి ఏరియాలో పెద్దపులి దాడి చేసి గాయపరిచింది. అనంతరం దానిని అక్కడే వదిలి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్లు ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. తాజాగా బెజ్జూర్ మండలం చిన్న సిద్దాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా పెద్ద సిద్ధాపూర్‌ రోడ్‌‌లో తిరుగుతున్న పులిని చూసి భయపడినట్టు తెలుస్తోంది. వెంటనే శ్రీనివాస్ చెట్టెక్కి ప్రాణాలను రక్షించుకున్నారు.

చెట్టుపై నుండి ఫారెస్ట్ అధికారులు, చిన్న సిద్దాపూర్ గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు అక్కడికు చేరుకుని పరిశీలించగా పులి అడవిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా పెంచికలపేట అటవీ ప్రాంతంలోనే పులి మకాం వేసినట్లు సమాచారం.ఈ ప్రాంతంలోని పశువులు, మనుషులే లక్ష్యంగా చేసుకుని పులి దాడులకు పాల్పడుతున్నట్టు సమచారం. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పులి కదలికలపై నిఘా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పెంచికలపేట వాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News