కేంద్రం పై యుద్ధం మొదలైంది: తుంగతుర్తి ఎమ్మెల్యే

దిశ, తుంగతుర్తి: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ వ్యాప్తంగా యుద్ధం మొదలైందని, ఇది క్రమక్రమంగా బలపడి అవిశ్రాంత పోరాటాలకు దారితీస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాలలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సింది పోయి దానికి విరుద్ధంగా నడుస్తోందని విమర్శించారు. పంజాబ్ లో వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు […]

Update: 2021-11-12 06:27 GMT

దిశ, తుంగతుర్తి: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ వ్యాప్తంగా యుద్ధం మొదలైందని, ఇది క్రమక్రమంగా బలపడి అవిశ్రాంత పోరాటాలకు దారితీస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాలలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సింది పోయి దానికి విరుద్ధంగా నడుస్తోందని విమర్శించారు.

పంజాబ్ లో వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మొండి చెయ్యి చూపుతోందని దుయ్యబట్టారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రాలలోని బీజేపీ నేతలు రైతుల పక్షాన ఉన్నారా లేక రాబందుల పక్కన ఉన్నారా ? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బండి కాదు గుండు సంజయ్ అని దెప్పి పొడుస్తూ ఆయన రోజురోజుకు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని ధ్వజమెత్తారు.

గల్లీయే కాదు.. ఢిల్లీలోనూ కోట్లాడుతాం : మంత్రి ఎర్రబెల్లి

Tags:    

Similar News