పేదల గుడిసెలకు నిప్పు పెట్టిన దుండగులు.. ఎవరు చేయించారు..?

దిశ, నర్సంపేట : అసైన్డ్ భూముల్లో గుడిసెలేసుకున్న పేదలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మూకుమ్మడిగా వచ్చి ఇండ్లకు నిప్పు పెట్టారు. నర్సంపేట పట్టణానికి కూతవేటు దూరంలో కాకతీయనగర్‌లో ఈ ఘటన గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని కాకతీయ‌నగర్‌లోని అసైన్డ్ భూముల్లో గత నెల రోజుల కిందట దాదాపు 300 పేద కుటుంబాలు సీపీఎం పార్టీ జెండాలు కట్టి గుడిసెలు వేసుకున్నారు. అప్పటి నుండి […]

Update: 2021-05-12 23:09 GMT

దిశ, నర్సంపేట : అసైన్డ్ భూముల్లో గుడిసెలేసుకున్న పేదలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మూకుమ్మడిగా వచ్చి ఇండ్లకు నిప్పు పెట్టారు. నర్సంపేట పట్టణానికి కూతవేటు దూరంలో కాకతీయనగర్‌లో ఈ ఘటన గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని కాకతీయ‌నగర్‌లోని అసైన్డ్ భూముల్లో గత నెల రోజుల కిందట దాదాపు 300 పేద కుటుంబాలు సీపీఎం పార్టీ జెండాలు కట్టి గుడిసెలు వేసుకున్నారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటూ 601 సర్వే నెంబర్‌లో తమకు పట్టాలివ్వాలని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున దాదాపు 40 మంది దుండగులు ఒక్కసారిగా గుడిసెలపై దాడి చేశారు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. మహిళలు, పిల్లలు అన్న కనికరం లేకుండా దౌర్జన్యం చేసి గుడిసెలకు నిప్పు పెట్టారు. బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇదే సమయంలో నిప్పుపెట్టి పారిపోతున్న పలువురు నిందితులను పట్టుకున్న బాధితులు పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News