మిరాకిల్.. మామిడి చెట్టుపై మూడంతస్తుల భవనం
దిశ, ఫీచర్స్ : మంచం మీద పడుకుని కదలకుండా తాజా మామిడి పండ్లను కోయగలరా? మీ పడక గదిలో పక్కనే ఉన్న గూళ్ల నుంచి పక్షుల శబ్దాలకు మేల్కొనడం ఎప్పుడైనా ఊహించారా? ఇవన్నీ ఆలోచిస్తే ‘డిస్నీ’ సినిమాలోని సన్నివేశంలా అనిపిస్తుంది. కానీ అజ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త కుల్ ప్రదీప్ సింగ్, అతని కుటుంబానికి ఇదే రొటీన్ లైఫ్. ఎందుకంటే అతడి ఇంటిని 40 అడుగుల మామిడి చెట్టుపై నిర్మించడం విశేషం. ఉదయపూర్‌లోని ఈ మూడు-అంతస్తుల ట్రీహౌస్‌లో రెండు […]
దిశ, ఫీచర్స్ : మంచం మీద పడుకుని కదలకుండా తాజా మామిడి పండ్లను కోయగలరా? మీ పడక గదిలో పక్కనే ఉన్న గూళ్ల నుంచి పక్షుల శబ్దాలకు మేల్కొనడం ఎప్పుడైనా ఊహించారా? ఇవన్నీ ఆలోచిస్తే ‘డిస్నీ’ సినిమాలోని సన్నివేశంలా అనిపిస్తుంది. కానీ అజ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త కుల్ ప్రదీప్ సింగ్, అతని కుటుంబానికి ఇదే రొటీన్ లైఫ్. ఎందుకంటే అతడి ఇంటిని 40 అడుగుల మామిడి చెట్టుపై నిర్మించడం విశేషం. ఉదయపూర్‌లోని ఈ మూడు-అంతస్తుల ట్రీహౌస్‌లో రెండు బెడ్‌రూమ్స్, కిచెన్, లైబ్రరీతో పాటు లివింగ్ ఏరియా ఉన్నాయి. కాగా ఈ ఇంటి ప్రత్యేకతల గురించి ఇంటి యజమాని ప్రదీప్ సింగ్ వివరించారు.
ప్రకృతిమయ జీవనం..
ప్రదీప్ సింగ్ 1999లో ఉదయపూర్‌లో ప్లాట్ కోసం వెతికే క్రమంలో ఈ ప్రాంతంలోని చెట్లకు హాని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో అక్కడి చెట్లను నరకకుండా మరెక్కడైనా రీప్లాంట్ చేయాలని ప్రాపర్టీ డీలర్‌కు చెప్తే అతడు తిరస్కరించి వెళ్లిపోయాడు. అందుకే ఈ విషయాన్ని చాలెంజ్‌గా తీసుకున్న సింగ్.. చెట్టును పెకిలించే బదులు దానిపైనే ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అలా స్థలం మధ్యలో మామిడి చెట్టు ఉన్న ప్లాట్‌ను తక్కువ ధరకు పొందాడు. ఆ తర్వాత ఓ ఆర్కిటెక్ట్ సాయంతో ఏడాది వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తిచేశాడు. అప్పుడు చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంటిని రెండు అంతస్థుల్లో నిర్మించారు. భూమి నుంచి తొమ్మిది అడుగుల ఎత్తున మామిడి చెట్టు కాండాన్ని బేస్‌గా చేసుకుని మొత్తం ఉక్కుతో నిర్మాణం చేపట్టారు. ఇంటి గోడలు, అంతస్తుల ఫ్లోర్స్ సెల్యులోజ్ షీట్‌తో పాటు ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి. పిడుగుపాటు సమయంలో విద్యుత్ వాహకంగా పనిచేసేలా చెట్టు చుట్టూ నాలుగు స్తంభాలను ఉంచారు.
మాడిఫికేషన్స్..
మామిడి చెట్టు 11 ఏళ్లలో 20 అడుగుల నుంచి 40 అడుగులకు పెరిగింది. ఇంతకు ముందు రెండంతస్తులు ఉన్న సింగ్ ఇల్లు ఇప్పుడు మూడంతస్తులకు మారింది. మొదటి అంతస్తులో వంటగది, బాత్రూమ్, డైనింగ్ హాల్ ఉన్నాయి. రెండో అంతస్తులో వాష్‌రూమ్, లైబ్రరీతో పాటు బెడ్‌రూమ్ ఉన్నాయి. ఇక మూడో అంతస్తున పైకప్పు ఒకే గదితో రూపొందించబడింది. ఈ ఇంట్లో తన భార్య, కొడుకు తమ తమ జీవితాలను ఆనందిస్తున్నారని, ప్రతి వేసవిలో మామిడికాయలను బహుమతిగా ఇస్తుందని సింగ్ చెప్పాడు.
ఇతర జీవులతో సహజీవనం ఆనందకరమే..
మా కిచెన్, బెడ్‌రూమ్ లోపల కొమ్మలను చూడవచ్చు. చెట్టు ఎదుగుదలను బట్టి ఇంటి నిర్మాణంలో అవసరమైన మార్పులు చేస్తాం. చెట్టుపై నివసించే పక్షులు, చిన్న చిన్న జంతువులు ఇప్పుడు మా కుటుంబ సభ్యులుగా మారిపోయాయి. ఇతర జీవులతో సహజీవనం చేయడం నిజంగా ఆనందకరమే. వాటి సహవాసాన్ని మేము నిజంగా ప్రేమిస్తున్నాం. ఖర్చుతో నిమిత్తం లేకుండా చెట్టు మనుగడకు భంగం కలగకూడదన్న లక్ష్యంతోనే ఇల్లు నిర్మించుకున్నా’ ప్రదీప్ సింగ్ తెలిపాడు.
‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించిన ఈ ట్రీహౌస్‌ను అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఉదయపూర్‌కు వెళ్తే.. అక్కడి అందమైన కోటలు, రాజభవనాలతో పాటు ఈ అద్భుతమైన ట్రీహౌస్‌ను చూసి ఆనందించండి.