సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్
దిశ, కంటోన్మెంట్: సిక్ విలేజీ ప్రాంతానికి చెందిన వివేక్ కుమార్ శుక్లా(27) జీడిమెట్ల షాపుర్ నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి 21న రాత్రి 9 గంటలకు విధులు ముగించుకొని డైమండ్ పాయింట్ చౌరస్తా నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని యువకులు శుక్లా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి, అతనిపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొని బోయిన్‌పల్లి మార్కెట్ […]
దిశ, కంటోన్మెంట్: సిక్ విలేజీ ప్రాంతానికి చెందిన వివేక్ కుమార్ శుక్లా(27) జీడిమెట్ల షాపుర్ నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి 21న రాత్రి 9 గంటలకు విధులు ముగించుకొని డైమండ్ పాయింట్ చౌరస్తా నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని యువకులు శుక్లా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి, అతనిపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొని బోయిన్‌పల్లి మార్కెట్ వైపు వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 7న కార్ఖాన మహాంకాళి దేవాలయం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆ ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సెల్‌ఫోన్ల చోరీ విషయంపై గుట్టు విప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు దొంగిలించిన తొమ్మది సెల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.