అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకటరామారావు, డైరెక్టర్లు శేషునారాయణ, హేమ సుందరప్రసాద్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. నేడు ఈడీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం ముంచింది. రూ.6,400 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు నిందితులపై అభియోగాలు ఉన్నాయి. 160 షెల్ కంపెనీలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడింది. ఈ కేసు దర్యాప్తును […]

Update: 2020-12-22 23:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకటరామారావు, డైరెక్టర్లు శేషునారాయణ, హేమ సుందరప్రసాద్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. నేడు ఈడీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం ముంచింది. రూ.6,400 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు నిందితులపై అభియోగాలు ఉన్నాయి. 160 షెల్ కంపెనీలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. విచారణ కోసం ముగ్గురిని నేడు కస్టడీకి కోరనుంది.

Tags:    

Similar News