ఫాజుల్ నగర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..
దిశ, వేములవాడ : భూమి వివాదంలో ఒకరిని కిరాతకంగా నరికి చంపడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ గ్రామంలో ఈనెల 19న పిట్టల మహేష్ (25) అనే యువకుడి హత్య జరిగింది. ఈ దాడిలోనే పిట్టల రాజేశం తీవ్రంగా గాయపడ్డాడు. ఒకరిని హత్యచేసి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన అదే కుటుంబానికి చెందిన పిట్టల లక్ష్మీ నరసయ్య, […]
దిశ, వేములవాడ : భూమి వివాదంలో ఒకరిని కిరాతకంగా నరికి చంపడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ గ్రామంలో ఈనెల 19న పిట్టల మహేష్ (25) అనే యువకుడి హత్య జరిగింది. ఈ దాడిలోనే పిట్టల రాజేశం తీవ్రంగా గాయపడ్డాడు. ఒకరిని హత్యచేసి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన అదే కుటుంబానికి చెందిన పిట్టల లక్ష్మీ నరసయ్య, పరశురాం, మొండెవ్వను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదెకరాల భూమి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏళ్ళుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈనెల 19న దాడి జరగడంతో పిట్టల మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. పిట్టల రాజేశం తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్నాడు. హత్య చేయడానికి ఉపయోగించిన 2 తల్వార్లతో తోపాటు ఒక బటన్ చాక్ నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. భూ వివాదాలు, సివిల్ తగాదాలకు సంబంధించిన సమస్యలను కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవాలని, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఐ బంసిలాల్, ఎస్ఐ మాలకొండ రాయుడు ఉన్నారు.