బైక్‌లో ఉన్న మూడు లక్షలు కొట్టేసిన కోతి.. చివరికి ఏం చేసిందంటే ?

దిశ, వెబ్‌డెస్క్ : కోతుల గురించి మనకు తెలిసిందే అవి చేతిలో ఏవి ఉంటే వాటిని లాగేసుకొని వెళ్లిపోతాయి. కానీ,  కోతి చేసిన విచిత్రపని ఓ వ్యక్తిని ఇబ్బందుల్లో నెట్టేసింది. ఇంతకీ కోతి ఏం చేసింది అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలో సాండీ పోలీస్ స్టేషన్  పరిధిలో రోడ్డు పక్కన ఓ బైక్ నిలిపి ఉంచారు. అయితే ఆ బైక్ మీదకు వెళ్లిన కోతి బైక్‌లో మూడు లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టు మీద […]

Update: 2021-08-15 22:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కోతుల గురించి మనకు తెలిసిందే అవి చేతిలో ఏవి ఉంటే వాటిని లాగేసుకొని వెళ్లిపోతాయి. కానీ, కోతి చేసిన విచిత్రపని ఓ వ్యక్తిని ఇబ్బందుల్లో నెట్టేసింది. ఇంతకీ కోతి ఏం చేసింది అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలో సాండీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఓ బైక్ నిలిపి ఉంచారు. అయితే ఆ బైక్ మీదకు వెళ్లిన కోతి బైక్‌లో మూడు లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టు మీద కూర్చుంది. అది గమనించిన బైక్ యజమాని బ్యాగ్ ఇవ్వమని కోతిని చాలా బతిమిలాడాడు. అయినా కోతి వినిపించుకోకుండా బ్యాగ్ తనదగ్గరే పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన యజమాని ఆశిష్ సింగ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. తాను వెళ్లగానే కోతి ఏం అనుకుందో ఏమో కానీ, మూడు లక్షలు ఉన్న బ్యాగ్‌ను కింద పడేసింది. దీనిని సమీపంలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు గమనించి, ఆ సొమ్మును తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వారు ఆశీష్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు. పోలీసులతో పాటు, ఆశీష్ ఆ హోమ్ గార్డు నిజాయితీని మెచ్చుకున్నారు.

Tags:    

Similar News