మారణాయుధాలతో నన్ను బెదిరించాడు
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలో శ్రీరాం హిల్స్ సమీపంలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 55 లోని 16 గుంటల తన భూమిని కిలారు రామకృష్ణ కబ్జా చేయాలని చూస్తున్నారని పసుమర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ విషయమై ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. సర్వే నెంబర్ 55 లోని 16 గుంటల తన భూమిని 2004వ సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ పశువుల షెడ్ […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలో శ్రీరాం హిల్స్ సమీపంలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 55 లోని 16 గుంటల తన భూమిని కిలారు రామకృష్ణ కబ్జా చేయాలని చూస్తున్నారని పసుమర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ విషయమై ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. సర్వే నెంబర్ 55 లోని 16 గుంటల తన భూమిని 2004వ సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ పశువుల షెడ్ నిర్మించి దానిలో మూగజీవాలైన ఆవులు సాదుకుంటున్నట్లు తాను తెలిపారు. అయితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఖమ్మం నగరానికి చెందిన కిలారు రామకృష్ణ 20 మంది తన అనుచరుల సహాయంతో మారణాయుధాలతో ఇక్కడికి వచ్చి పశువుల షెడ్డును పూర్తిగా నేలమట్టం చేసి.. మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ విషయమై డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానన్నాడు. అదేవిధంగా ఖమ్మం సీపీ తఫ్సిర్ ఇక్బాల్ గారిని కలిసి ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన చెప్పారు.