బాంద్రా స్టేషన్ ముందు వేలాది మంది వలస కూలీలు

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట వేలాది మంది వలస కూలీలు గుమిగూడారు. బీహార్‌లోని సొంతూళ్లకు శ్రామిక్ ట్రైన్‌లో వెళ్లాలని మూటలు సర్దుకుని గుంపులు గుంపులుగా స్టేషన్‌ ముందుకు తరలారు. ఇంటికెళ్లాలన్న తాపత్రయంలో పరుగులుపెట్టారు. స్టేషన్ ముందు రోడ్డు రద్దీగా మారింది. భౌతిక దూరం, మాస్కులు ఇటువంటి జాగ్రత్తలు కనుమరుగైన స్థితిలో పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలను మాత్రమే అధికారులు స్టేషన్‌లోకి అనుమతించారు. మిగతావారందరిని తిప్పి […]

Update: 2020-05-19 10:01 GMT

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట వేలాది మంది వలస కూలీలు గుమిగూడారు. బీహార్‌లోని సొంతూళ్లకు శ్రామిక్ ట్రైన్‌లో వెళ్లాలని మూటలు సర్దుకుని గుంపులు గుంపులుగా స్టేషన్‌ ముందుకు తరలారు. ఇంటికెళ్లాలన్న తాపత్రయంలో పరుగులుపెట్టారు. స్టేషన్ ముందు రోడ్డు రద్దీగా మారింది. భౌతిక దూరం, మాస్కులు ఇటువంటి జాగ్రత్తలు కనుమరుగైన స్థితిలో పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలను మాత్రమే అధికారులు స్టేషన్‌లోకి అనుమతించారు. మిగతావారందరిని తిప్పి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ సమీపంలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం శ్రామిక్ ట్రైన్ పాస్‌ల కోసం వేలాది మంది భౌతిక దూరం పాటించకుండాగుమిగూడిన ఘటన కలవరపెట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News