‘హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి’
దిశ, అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరి భాగం వెంకటేశ్వరరావు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన సమయంలో బీట్ ఆఫీసర్ మదన్ లాల్ చిత్ర హింసలకు గురి చేయడం వలనే, వెంకటేశ్వరరావు మృతి చెందాడని న్యూడెమోక్రసీ నాయకులు పద్దం వెంకన్న ఆరోపించారు. మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఫారెస్ట్ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. […]
దిశ, అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరి భాగం వెంకటేశ్వరరావు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన సమయంలో బీట్ ఆఫీసర్ మదన్ లాల్ చిత్ర హింసలకు గురి చేయడం వలనే, వెంకటేశ్వరరావు మృతి చెందాడని న్యూడెమోక్రసీ నాయకులు పద్దం వెంకన్న ఆరోపించారు. మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఫారెస్ట్ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల పోడు సాగుదారులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దానికి ఉదాహరణ భాగం వెంకటేశ్వరరావు మృతి అని ఆరోపించారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవులూరి మధు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఉమర్, డివిజన్ నాయకులు సురేందర్, వెంకట్రావు, సీతరాములు, తదితరులు పాల్గొన్నారు.