భద్రాచలంకు పూర్వ వైభవం

భద్రాచలం పట్టణం పూర్వ వైభవం సంతరించుకోనుంది.

Update: 2024-11-27 13:03 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణం పూర్వ వైభవం సంతరించుకోనుంది. గతంలో మండలంగా వెలుగొందిన భద్రాచలం పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రలో విలీనం అయిన తర్వాత మండల హోదా కోల్పోయుంది. అప్పటి నుండి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. తెలంగాణ విభజనకు ముందు ఈ మండలంలో 73 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పోలవరం ముంపు పేరుతో భద్రాచలం రెవెన్యూ విలేజ్ మినహా మిగిలిన గ్రామాలు అన్ని ఆంధ్రలో కలపడంతో భద్రాచలం వైభవం కోల్పోయుంది. 2014 సంవత్సరంలో భద్రాచలం మండలానికి చివరిసారిగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి.

     12 మంది ఎంపీటీసీలు, ఒక కో ఆప్షన్ సభ్యుడు ఉండేవారు. వీరి పదవీ కాలం 2020 జూలై 2వ తేదీతో ముగిసింది. అనంతరం భద్రాచలం మండలం హోదా కోల్పోయిన కారణంగా ఇక్కడ ఎన్నికలు జరపలేదు. అయితే ఇప్పుడు భద్రాచలంకు మళ్లీ మండల హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక నిధులతో పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి రాజకీయ నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. భద్రాచలంకు మండలం హోదా కల్పించడం పట్ల కాంగ్రెస్ నాయకులు బుడగం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్ తో పాటు పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. 


Similar News