ఆ ప్రెసిడెంట్ సాబ్‌కు.. ఓ ‘లెక్క’ ఉంది!

దిశ, వెబ్‌డెస్క్: మన దేశ రాజకీయాల్లో ‘పారదర్శకమైన పాలన’ అందించిన నాయకులను వేళ్లపైనే లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్ మారుతుందనేది కాదనలేని సత్యం. ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతుండగా.. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్నికల్లో పోటీ చేసిన యువత గెలుపొందడం శుభపరిణామ. అంతేకాదు పంచాయతీ ఎలక్షన్స్‌లోనూ ఈ సారి ఎక్కువమంది ఎడ్యుకేట్స్‌ పార్టిసిపేట్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే గతేడాది తమిళనాడు, తిరుపతూర్ జిల్లాలోని సెవెనిపట్టి […]

Update: 2021-01-10 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన దేశ రాజకీయాల్లో ‘పారదర్శకమైన పాలన’ అందించిన నాయకులను వేళ్లపైనే లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్ మారుతుందనేది కాదనలేని సత్యం. ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతుండగా.. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్నికల్లో పోటీ చేసిన యువత గెలుపొందడం శుభపరిణామ. అంతేకాదు పంచాయతీ ఎలక్షన్స్‌లోనూ ఈ సారి ఎక్కువమంది ఎడ్యుకేట్స్‌ పార్టిసిపేట్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే గతేడాది తమిళనాడు, తిరుపతూర్ జిల్లాలోని సెవెనిపట్టి పంచాయతీ ప్రెసిడెంట్‌గా 32 ఏళ్ల సెవర్ కొడియన్ ఎన్నికయ్యాడు. తాజాగా ఆయన చేసిన ఓ పనికి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాడు. పంచాయతీ అకౌంట్స్ లెక్కలను ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేయడంతో గత 24 గంటల నుంచి ఆయన పేరు నెట్టింట్లో మారుమోగుతోంది.

కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడియన్.. కొన్నేళ్ల పాటు సింగపూర్‌లో ఉద్యోగం చేసి, వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో సొంతూరికి వచ్చేశాడు. సాంకేతికత సాయంతో ఫార్మింగ్ చేసి అధిక దిగుబడిని సాధించడంతో.. ఆ ఊరి ప్రజలు కూడా తన పద్ధతులను అనుసరించడం మొదలుపెట్టారు. అంతేకాదు యువత కూడా కొడియన్‌ సలహాలతో తమ కెరీర్‌ను బిల్డప్ చేసుకుంటున్నారు. ఇలా ఊరి ప్రజలు కొడియన్‌పై ఎనలేని అభిమానాన్ని పెంపొందించుకున్నారు. ఈ క్రమంలోనే ఎలక్షన్స్ రాగా, తనదైన ఎజెండాతో ప్రజల్లోకెళ్లిన కొడియన్.. సులభంగా విజయం సాధించాడు. అనుకున్నట్లే తన పాలనలో పారదర్శకత తీసుకురావడంతో పాటు రోడ్లు వేయాలన్నా, అంగన్‌వాడీ సెంటర్‌కు సౌకర్యాలు సమకూర్చాలన్నా, పబ్లిక్ మనీ స్పెండ్ చేయాల్సిన ప్రతిచోట ఆ ఊరి ప్రజలను కూడా ఇన్‌వాల్వ్ చేసేవాడు. ప్రజాదరణతో పాలన కొనసాగిస్తున్న కొడియన్.. ఈ నెలాఖరుకు ప్రెసిడెంట్‌గా ఏడాదికాలం పూర్తిచేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా తను చేసిన అభివృద్ధి పనులతో కూడిన ప్రోగ్రెస్ కార్డ్‌తో పాటు ఏడాదిగా ఖర్చు చేసిన నిధుల మొత్తాన్ని (అకౌంట్స్) ఫేస్‌బుక్‌లో అప్‌‌లోడ్ చేశాడు. దాంతో గ్రామ ప్రజల ప్రశంసలతో పాటు నెటిజన్లు అభినందనలు పొందుతున్నాడు.

ప్రజాప్రతినిధులు ‘పారదర్శకత పాలన’ అందిస్తే, నిజమైన అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తుందనడానికి కొడియన్ పాలనే నిదర్శనం. ఇకనైనా కొడియన్ స్ఫూర్తితో ప్రతీ ప్రజానేత తమ నిధుల లెక్కలను బహిరంగపరిస్తే.. ప్రజాభివృద్ధికి అడ్డుపడే అసలు దొంగెవరో తెలుస్తుంది.

Tags:    

Similar News