IPLలో ఆలస్యంగా కనిపించనున్న ‘స్టోక్స్’
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా UAEలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR) విధ్వంసకర ఆటగాడు ‘బెన్ స్టోక్స్’ కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు.అతని తండ్రికి క్యాన్సర్ రావడంతో స్టోక్స్.. ఆగస్టు నెలలోనే న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఈ నెల 19 నుంచి IPL ప్రారంభమయ్యే సమయానికి UAE కి తిరిగి చేరుకోనున్నాడు. అయితే, స్టోక్స్ అక్కడకు వెళ్లినా కొద్దిరోజులు క్వారంటైన్‌లో ఉండక తప్పని పరిస్థితి. దీంతో బెన్ స్టోక్స్ కనీసం రెండు వారాలు […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా UAEలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR) విధ్వంసకర ఆటగాడు ‘బెన్ స్టోక్స్’ కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు.అతని తండ్రికి క్యాన్సర్ రావడంతో స్టోక్స్.. ఆగస్టు నెలలోనే న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఈ నెల 19 నుంచి IPL ప్రారంభమయ్యే సమయానికి UAE కి తిరిగి చేరుకోనున్నాడు.
అయితే, స్టోక్స్ అక్కడకు వెళ్లినా కొద్దిరోజులు క్వారంటైన్‌లో ఉండక తప్పని పరిస్థితి. దీంతో బెన్ స్టోక్స్ కనీసం రెండు వారాలు ఐపీఎల్‌లో కనిపించకపోవచ్చు.విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన స్టోక్స్ మైదానంలో లేకపోవడం RRకు పెద్ద ఇబ్బందేనని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.