‘కాఫీ’ ధర.. మర్యాదను బట్టి నిర్ణయిస్తారట.. ఎక్కడో తెలుసా.?

దిశ, ఫీచర్స్ : ఎదుటివాళ్లు తనను గౌరవించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. తోటివారిని గౌరవించే అలవాటు తనకున్నా లేకపోయినా.. తను మాత్రం ఇతరుల నుంచి అది ఆశిస్తాడు. నువ్వు ఇవ్వనప్పుడు మరొకరి దగ్గరి నుంచి దాన్ని కోరుకోవడం కూడా తప్పే. అందుకే ఒకరికొకరు ‘గౌరవం’ ఇచ్చిపుచ్చుకోవడం ఓ సద్గుణం. ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనం కోల్పోయేది ఏమి ఉండదు. అదనంగా మరింత గౌరవాన్ని, ప్రేమను ఎదుటి వ్యక్తుల నుంచి పొందుతాం. కానీ కొందరికి వారి అధికారం, […]

Update: 2021-05-31 08:17 GMT

దిశ, ఫీచర్స్ : ఎదుటివాళ్లు తనను గౌరవించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. తోటివారిని గౌరవించే అలవాటు తనకున్నా లేకపోయినా.. తను మాత్రం ఇతరుల నుంచి అది ఆశిస్తాడు. నువ్వు ఇవ్వనప్పుడు మరొకరి దగ్గరి నుంచి దాన్ని కోరుకోవడం కూడా తప్పే. అందుకే ఒకరికొకరు ‘గౌరవం’ ఇచ్చిపుచ్చుకోవడం ఓ సద్గుణం. ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనం కోల్పోయేది ఏమి ఉండదు. అదనంగా మరింత గౌరవాన్ని, ప్రేమను ఎదుటి వ్యక్తుల నుంచి పొందుతాం. కానీ కొందరికి వారి అధికారం, స్థాయిని బట్టి మనం ‘గౌరవాన్ని’ ఇస్తుంటాం. నిజానికి తోటి మానవుల పట్ల ప్రేమ చూపడం అనే సుగుణం అలవరచుకుంటే గౌరవం దానికదే సాధ్యమౌతుందని, సమాజంలో స్థాయి, హోదా వల్ల కాకుండా మనుషులుగా గౌరవాభిమానులు అందించాలనే ఉద్దేశంతో వర్జీనియాలోని ఓ కేఫ్ నిర్వాహకులు ‘మర్యాద’ ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు.

ఇంట్లో ఉంటే ఒకలా, ఆఫీసులో మరోలా, ఆలయంలో ఇంకోలా.. ఇలా ప్రదేశాన్ని బట్టి మన పద్ధతిలో, ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. పదిమందిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తిస్తాం. అంటే సామాజిక మర్యాదను పాటిస్తాం. కానీ అదే హోటల్‌కు వెళితే.. అక్కడ మాత్రం చాలామంది సామాజిక మర్యాదను పాటించడాన్ని మరిచిపోతారు. ఉదాహరణకు.. ఏయ్ బేరర్, హలో బేరర్, ఇంకా అరేయ్, ఒరేయ్ అని కూడా పిలుస్తుంటారు. అంతేకాదు రెస్టారెంట్లు, కేఫ్‌ల నగదు కౌంటర్ వద్ద అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా బోలెడంతా మంది ఉంటారు.

అయితే కేఫ్‌లో మీ మాటతీరు, ప్రవర్తించే పద్ధతి ఆధారంగా రెస్టారెంట్ బిల్ ధర నిర్ణయించడం ఎప్పుడైనా చూశారా? కానీ వర్జీనియాలోని రోనోకేలోని ‘కప్స్, కాఫీ అండ్ టీ’ కేఫ్ నిర్వాహకులు మాత్రం ఈ సామాజిక మర్యాదనే ‘బిజినెస్ పాలసీ’గా మార్చారు. ఈ కేఫ్‌లో కాఫీని ఆర్డర్ చేసే విధానంతోనే కాఫీ ధర నిర్ణయిస్తారు. “స్మాల్ కాఫీ” అంటే.. $ 5, అదే “స్మాల్ కాఫీ ప్లీజ్” అని ఆర్డర్ ఇస్టే రెండు డాలర్లు తగ్గుతుంది. అంటే 3డాలర్లకే కాఫీ వస్తుంది. “హలో, వన్ స్మాల్ కాఫీ ప్లీజ్” అని మీరు పొలైట్ పదాన్ని యాడ్ చేయగానే దాని ధర మరో సగానికి తగ్గిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు ఎంత మర్యాదగా ఉంటారో, కాఫీ ధర అంత తక్కువగా ఉంటుంది.

ఇతరులను గౌరవించడం చాలా ముఖ్యమం. మన అలవాట్లను చూసే పిల్లలు కూడా మనల్ని అనుకరిస్తారు. భావితరాలకు వాటిని అందిస్తారని అందుకే ఈ పాలసీ తీసుకొచ్చామని నిర్వహాకులు చెబుతున్నారు. ఇతరుల పట్ల ప్రేమ, దయతో పాటు మర్యాదగా ఉండటం వల్ల ఖర్చేమి ఉండదని, దానికి బదులుగా ఇది ఒకరి రోజును మరింత అందంగా చేస్తుందని వాళ్లు చెబుతున్నారు. నిజమే కదా.. ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఆనందం, అభిమానం ఉంటాయి. ఈసారి టీ, కాఫీలకు వెళ్లినప్పుడూ.. నవ్వుతూ.. మర్యాదతో ఆ వ్యక్తిని పలకరించి చూడండి, అక్కడికి వెళ్లినప్పుడల్లా అంతకు రెట్టింపు ప్రేమ, గౌరవం తిరిగి అందిస్తాడు.

 

Tags:    

Similar News