ప్రపంచాన్ని చుట్టేసిన యంగెస్ట్ లేడి..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అందమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనే కోరిక ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలోని ఎన్నో సమస్యలు, మరెన్నో కారణాలు అందుకు అడ్డుపడుతుంటాయి. అయితే అందరి విషయంలోనూ ఇలా జరిగే చాన్స్ లేదు. ఎందుకంటే కొందరు తాము అనుకున్నది సాధించేవరకు విశ్రమించరు. ఇక ట్రావెలింగ్ విషయానికొస్తే.. వీలైనన్ని ప్రదేశాలను చుట్టేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే లెక్సీ ఆల్‌ఫోర్డ్ అనే యంగ్ ఉమన్.. ట్రావెలింగ్‌కు అనుకూలంగా లేని నార్త్ కొరియా తదితర దేశాలు […]
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అందమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనే కోరిక ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలోని ఎన్నో సమస్యలు, మరెన్నో కారణాలు అందుకు అడ్డుపడుతుంటాయి. అయితే అందరి విషయంలోనూ ఇలా జరిగే చాన్స్ లేదు. ఎందుకంటే కొందరు తాము అనుకున్నది సాధించేవరకు విశ్రమించరు. ఇక ట్రావెలింగ్ విషయానికొస్తే.. వీలైనన్ని ప్రదేశాలను చుట్టేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే లెక్సీ ఆల్‌ఫోర్డ్ అనే యంగ్ ఉమన్.. ట్రావెలింగ్‌కు అనుకూలంగా లేని నార్త్ కొరియా తదితర దేశాలు సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు 21 ఏళ్లకే ప్రయాణించి రికార్డు సృష్టించింది.
చిన్న వయసులోనే ట్రావెలింగ్ మొదలుపెట్టిన లెక్సీకి ప్రస్తుతం 23 సంవత్సరాలు. పేరెంట్స్‌కు ట్రావెల్ ఏజెన్సీ ఉండటం కూడా తనకు ప్రపంచ దేశాలన్నింటికీ ప్రయాణించాలనే కోరిక కలిగేందుకు కారణం కావచ్చు. 18 ఏళ్లు ఉన్నప్పుడే దాదాపు 70 దేశాలకు ప్రయాణించిన లెక్సీ.. తనకు ఇష్టమైన ట్రావెలింగ్‌లో అంతకుముందున్న రికార్డును బ్రేక్ చేయాలని డిసైడ్ అయింది. తల్లిదండ్రులు ప్రతీ ఏడాది తనను కొన్ని వారాలు, నెలల పాటు స్కూల్ మాన్పించి ఇండిపెండెంట్ స్టడీపై ఫోకస్ చేయమనేవారు. ఈ క్రమంలోనే కంబోడియాలోని తేలియాడే గ్రామాల నుంచి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వరకు, అర్జెంటీనా సరిహద్దుల నుంచి ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్‌ల వరకు చూసేసింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న ప్రతీ జీవన విధానాన్ని తెలుసుకునేందుకు ఆమె పేరెంట్స్ చాలా ప్రాముఖ్యతనివ్వగా.. అదే తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది.
‘విషయాలు నిజంగా సవాలుగా మారడం మొదలుపెట్టిన తర్వాత నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా యువతులకు స్ఫూర్తినిస్తున్నానని గ్రహించాను. ఇంతగా మద్దతు లభిస్తుంటే కఠిన పరిస్థితులు ఎదురైనా సరే ముందుకు సాగాలని, ప్రపంచాన్ని అందరికీ చూపించాలని నిశ్చయించుకున్నా. మీడియా చిత్రీకరించినంత భయానకంగా లేదు. ప్రతిచోటా దయ ఉంది’ అని ఆల్‌ఫోర్డ్ లెక్సీ తెలిపింది.
ఒంటరిగా ప్రయాణించే స్త్రీని ప్రపంచవ్యాప్తంగా పితృస్వామ్య సంఘాలు ఎల్లప్పుడూ నాటకీయంగా చూస్తాయి. ఆల్‌ఫోర్డ్ జీవిత కథ అటువంటి అనేక భావనలను ధిక్కరిస్తుంది, మహిళలకు ట్రావెలింగ్ చేయడంలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించడంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తుంది.