ప్రియురాలు ఆ పనికి ఒప్పుకోలేదని.. పోలీసులకు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్ : విద్యాబుద్దులు పెరిగినా.. కొందరి ఉన్నత విద్యావంతుల బుద్దులు మాత్రం మారడం లేదు. అమ్మాయిలు ఏ మాత్రం చనువుగా మాట్లాడినా.. అది ప్రేమే అనుకుంటున్నారు. అవతలి వారి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తూ.. ఎదుటి వారి జీవితాలను బజారుకు ఈడుస్తు్న్నారు. తాజాగా ఓ డాక్టర్.. తన క్రిమినల్ మెంటాల్టీని బయటపెట్టుకున్నాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిరువనంతపురానికి చెందిన హరీశ్ హరిదాస్.. లార్డ్స్ ఆస్పత్రి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. […]
దిశ, వెబ్‌డెస్క్ : విద్యాబుద్దులు పెరిగినా.. కొందరి ఉన్నత విద్యావంతుల బుద్దులు మాత్రం మారడం లేదు. అమ్మాయిలు ఏ మాత్రం చనువుగా మాట్లాడినా.. అది ప్రేమే అనుకుంటున్నారు. అవతలి వారి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తూ.. ఎదుటి వారి జీవితాలను బజారుకు ఈడుస్తు్న్నారు. తాజాగా ఓ డాక్టర్.. తన క్రిమినల్ మెంటాల్టీని బయటపెట్టుకున్నాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తిరువనంతపురానికి చెందిన హరీశ్ హరిదాస్.. లార్డ్స్ ఆస్పత్రి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్‌తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంగా వారి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. అయితే శోభా విశ్వనాథ్‌ను పెళ్లాడాలనుకున్న హరీశ్ హరిదాస్.. ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. దీనికి ఆమె నిరాకరింది. దీంతో శోభా విశ్వనాథ్‌పై పగ పెంచుకున్న డాక్టర్.. ఓ పథకం పన్నీ ఆమెను అక్రమంగా కేసులో ఇరికించాడు.
శోభా విశ్వనాథ్ దగ్గర పని చేసే వివేక్ రాజ్‌ను హరీశ్ మచ్చిక చేసుకుని అతడి ద్వారా ఆమె ఇంట్లో గంజాయిని పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించాడు. మాదకద్రవ్యాల అక్రమ నిల్వల కేసులో ఆమెపై కేసు నమోదు కావడంతో కేరళ సీఎం పినరయ్ విజయన్ కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు శోభా విశ్వనాథ్‌ను నిర్దోషిగా తేల్చారు. ఆమెపై కుట్రతోనే హరీశ్ హరిదాస్ తప్పుడు దారిలో కేసు పెట్టించాడని నిర్ధారించారు. హరీశ్ హరిదాస్‌తోపాటు ఆయనకు సహకరించిన వివేక్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.