వారి స్పెషల్.. లవర్సే

దిశ, కొత్తగూడెం: సులువుగా డబ్బు సంపాదించేందుకు ఒంటరిగా ఉండే లవర్స్, మహిళల వద్ద ఉండే బంగారు ఆభరణాల చోరీ, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ అశోక్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందికి రేగళ్ళ అటవీ ప్రాంతంలో అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..లక్ష్మీదేవి పల్లి మండలం […]

Update: 2020-06-30 09:36 GMT

దిశ, కొత్తగూడెం: సులువుగా డబ్బు సంపాదించేందుకు ఒంటరిగా ఉండే లవర్స్, మహిళల వద్ద ఉండే బంగారు ఆభరణాల చోరీ, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ అశోక్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందికి రేగళ్ళ అటవీ ప్రాంతంలో అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం..లక్ష్మీదేవి పల్లి మండలం లోతువాగు ప్రాంతానికి చెందిన మహమ్మద్ బాబ్జి అలియాస్ బ్లేడ్ బాబ్జి, కొత్తగూడెంలోని స‌ఫాయి బ‌స్తీ ప్రాంతానికి చెందిన గిరిమల్ల భరత్, బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన మచ్చ రాజేందర్, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, అదే మండ‌లంలోని బావుజి తండాకు చెందిన జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం ప్రారంభించారు.

వీరిలో జజ్జర్ల రాజు, ఏరువ ఉదయ్ కుమార్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో రేగళ్ల అటవీ ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణించే ప్రేమికులను, ఆడ వారిని కత్తులతో బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేసేవాళ్లు. అంతేగాక ఒంటిపై ఉన్న ఆభ‌ర‌ణాల‌ను దోచుకునేవారని విచారణలో వెల్లడైనట్టు సీఐ అశోక్ తెలిపారు.

ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన ప్రేమికుల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా, కత్తులతో బెదిరించి వారి నుంచి వస్తువులు, నగదును కాజేశేవారని తేలింది.గతంలో వీరిపై లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో రెండు దోపిడీ కేసులు, ఒక దొంగతనం కేసు, చుంచుపల్లి పీఎస్‌లో ఒక దొంగతనం కేసు నమోదైనట్టు సీఐ చెప్పారు.ఈ ముఠాలో కొంతమంది ఐదేండ్లు జైలు శిక్ష కూడా అనుభవించారని సమాచారం. వీరి నుంచి సుమారుగా 10 తులాల బంగారం, రెండు బైకులు, రెండు కత్తులు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తామని సీఐ అశోక్ తెలిపారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో ఈ ముఠా దోపిడీకి గురైన బాధితులు ఎవరైనా ఉంటే లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయవలసిందిగా సీఐ అశోక్ కోరారు.

Tags:    

Similar News