నీ బలహీనతపై ఫోకస్ చెయ్.. కోహ్లీకి సన్నీ సూచన

దిశ, స్పోర్ట్స్: రన్ మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై మాజీ దిగ్గజ క్రీడకారుడు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్‌లో టెక్నిక్ లోపంతోనే విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. లార్డ్స్‌లో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 42 పరుగులు చేసి కాస్త ఫరవాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లో కేవలం 20 పరుగులే చేశాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బంతిని ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ బ్యాటింగ్ […]

Update: 2021-08-16 10:57 GMT

దిశ, స్పోర్ట్స్: రన్ మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై మాజీ దిగ్గజ క్రీడకారుడు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్‌లో టెక్నిక్ లోపంతోనే విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. లార్డ్స్‌లో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 42 పరుగులు చేసి కాస్త ఫరవాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లో కేవలం 20 పరుగులే చేశాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బంతిని ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ బ్యాటింగ్ టెక్నిక్‌లో సమస్య కనిపిస్తోందని గవాస్కర్ కామెంట్ చేశాడు.

తన బలహీనతపై కోహ్లీ ఇంకా ఫోకస్ చేయాలని తెలిపాడు. ఆఫ్ సైడ్ దూరంగా వెళ్లే బంతులను ఆడటంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించాడు. కాగా, రెండేళ్లుగా విరాట్ సెంచరీ చేయకపోవడం అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన మ్యాచులలోనూ విఫలమవడం అతనిపై విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా అండర్సన్, రాబిన్ సన్‌లు కోహ్లి ఔట్ చేయడానికి ఆ ప్రాంతంలోనే బంతులను వేస్తున్నారన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ జట్టు బాధ్యతలను తనపై వేసుకుని అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు.

 

Tags:    

Similar News