మా ఫ్యామిలీని అడగాలి : పాండ్యా
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు మరోసారి ఆల్‌రౌండర్ అవసరాన్ని గుర్తి చేసింది. ప్రస్తుతం తుది జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. వెన్నెముక గాయం తర్వాత పాండ్యా కేవలం బ్యాటింగ్‌కు పరిమితమయ్యాడు. ఇక రవీంద్ర జడేజా అటు బ్యాటుతో ఇటు బంతితో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బౌలింగ్ మెరుగుపడటానికి […]
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు మరోసారి ఆల్‌రౌండర్ అవసరాన్ని గుర్తి చేసింది. ప్రస్తుతం తుది జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. వెన్నెముక గాయం తర్వాత పాండ్యా కేవలం బ్యాటింగ్‌కు పరిమితమయ్యాడు. ఇక రవీంద్ర జడేజా అటు బ్యాటుతో ఇటు బంతితో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బౌలింగ్ మెరుగుపడటానికి నెట్స్‌లో పూర్తి సాధన చేస్తున్నాను.
గాయం తర్వాత బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించలేదు. పూర్తి సామర్థ్యం సాధించిన తర్వాతే సరైన సమయంలో బౌలింగ్ చేస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం టీ20 ప్రపంచ కప్. ఇతర టోర్నీలతో పోలిస్తే అక్కడే నా అవసరం ఎక్కువగా ఉంది. ఇక టీమిండియాకు మరో ఆల్‌రౌండర్ కావాలంటే మా ఫ్యామిలీనే అడగాలి’ అంటూ నవ్వుతూ సమాధాన మిచ్చాడు. హార్దిక్ సోదరుడు కృనాల్ కూడా ఆల్‌రౌండరే. ఈ నేపథ్యంలోనే తన సోదరుడిని తీసుకోమని హార్దిక్ ఒక రకంగా చెప్పకనే చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. తొలి వన్డేలో పాండ్యా 90 పరుగులతో చెలరేగాడు. అయినా భారత్ ఆ వన్డే 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.