అలా తెస్తే కిలో ధాన్యం కూడా కటింగ్ చేసేదిలేదు: ఈటెల
దిశ, కరీంనగర్: మొక్కజొన్న దిగుబడి గతంలోకంటే చాలా పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో 20వేల టన్నుల కెపాసిటీ గల స్నేహ సీడ్స్ గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ దిగువ భాగాన ఉన్న పంట పొలాలకు పుష్కలంగా అందుతుండడంతో పంటలు బాగా పండాయన్నారు. మక్కలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల విషయమై ప్రతిరోజూ […]
దిశ, కరీంనగర్: మొక్కజొన్న దిగుబడి గతంలోకంటే చాలా పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో 20వేల టన్నుల కెపాసిటీ గల స్నేహ సీడ్స్ గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ దిగువ భాగాన ఉన్న పంట పొలాలకు పుష్కలంగా అందుతుండడంతో పంటలు బాగా పండాయన్నారు. మక్కలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల విషయమై ప్రతిరోజూ సమీక్షా నిర్వహిస్తున్నామని, రైతులకు ఇబ్బంది కలగకుండా, పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయమని అధికారులకు ప్రతిరోజూ ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. పంటల కొనుగోలు కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించి రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. ఊహించని రీతిలో మక్కల దిగుబడి వచ్చినందున గోదాములు సరిపోవడం లేదన్నారు. ఈ కారణంగానే ప్రైవేటు గోదాములు లీజుకు తీసుకుంటున్నామని వివరించారు. కమలాపూర్ మండల రైతుల కోసం జమ్మికుంట మార్కెట్ లో రెండు షెడ్లు కేటాయించామని, బెండ్లు, రాళ్లు, నల్ల గింజలు లేకుండా నిఖార్సయిన మొక్కజొన్నలను మార్కెట్ కు తీసుక రావాలని రైతులను కోరారు. మేలైన, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కిలో ధాన్యం కూడా కటింగ్ చేసేది లేదని మంత్రి తెలిపారు. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లర్లు జాప్యం లేకుండా వెంటవెంటనే దిగుమతి చేసుకుని.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు.