రైతుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన వెంకట రాజిరెడ్డి
దిశ, హుజురాబాద్ : వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన వెంకట రాజిరెడ్డి అనే రైతుపై మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. చేతి వేళ్ళు తెగిపోయాయి. స్థానికుల కథనం ప్రకారం వెంకట రాజిరెడ్డి తన మక్క జొన్న చేనుకు నీళ్ళు కడుతుండగా ముసుగు ధరించిన వ్యక్తులు దాడి చేశారు.ఈ ఘటనలో రాజిరెడ్డి చేతి వేళ్ళు తెగిపోగా ఆసుపత్రికి తరలించారు.అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.