Ponnam: ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశాలు

బస్‌స్టాండ్ బ్యూటిఫికేషన్ పనులు(Bus Stand Beautification Work) ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు.

Update: 2024-12-24 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్: బస్‌స్టాండ్ బ్యూటిఫికేషన్ పనులు(Bus Stand Beautification Work) ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సొంత నియోజకవర్గం హుస్నాబాద్(Husnabad) పర్యటనలో ఉన్న ఆయన.. హుస్నాబాద్ బస్‌స్టాండ్ పునరాభివృద్ది పనులపై(Redevelopment Work) ఆరా తీశారు. అలాగే బస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పనులు ఎక్కడి వరకు వచ్చాయని ఆర్టీసీ అధికారులను(RTC officials) అడిగి తెలుసుకున్నారు. అంతేగాక బస్‌స్టాండ్ లో బ్యూటిఫికేషన్ లోపలికి, బయటకు వచ్చే మార్గాల అభివృద్ది.. బస్ స్టేషన్ బయట కాంప్లెక్స్ లకు రంగుల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించించారు. ఇక బస్‌స్టాండ్ ఆవరణలో రోడ్డు వైడింగ్ లో షాపులు కోల్పోతున్న వారితో మాట్లాడి.. వారికి నష్టం జరగకుండా పనులు చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 31 లోపు బస్‌స్టాండ్ పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News