నీటిని విడుదల చేయాలని వినతి..సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
మండలంలోని నారాయణపురం చెరువు నీటి కోసం ఎల్లంపల్లి నుంచి
దిశ, గంగాధర: మండలంలోని నారాయణపురం చెరువు నీటి కోసం ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని గంగధార మండలంలోని వివిధ గ్రామాల రైతులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి రైతులు వినతి పత్రం అందించారు. రైతుల ఇచ్చిన వినతి పత్రానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సత్యం వారం రోజుల్లో నీటిని విడుదల చేయిస్తానని, నియోజకవర్గంలో ఒక గుంట కూడా ఎండిపోకుండా రైతులను కాపాడుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.