ఆసిఫాబాద్ ‘కంచుకోట’లో దోపిడీ దొంగలు
దిశ, ఆసిఫాబాద్ రూరల్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కంచుకోటకాలనీలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తన కుమారుడితో కలిసి రాజీవ్ నగర్‌లో ఉంటున్న తల్లి ఇంటికెళ్ళింది స్వప్న. ఆ తర్వాత తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసింది స్వప్న. బీరువా తాళం పగలగొట్టి ఉండగా.. అందులో ఉన్న […]
దిశ, ఆసిఫాబాద్ రూరల్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కంచుకోటకాలనీలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తన కుమారుడితో కలిసి రాజీవ్ నగర్‌లో ఉంటున్న తల్లి ఇంటికెళ్ళింది స్వప్న. ఆ తర్వాత తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసింది స్వప్న. బీరువా తాళం పగలగొట్టి ఉండగా.. అందులో ఉన్న ఆరున్నర తులాల బంగారం చోరీ అవడంతో బాధితురాలు ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన ఎస్ఐ వెంకటేష్ ఇంట్లోని పరిసరాలను పరిశీలించారు. ఫింగర్ ప్రింట్‌లను తీసుకున్నారు. చోరీ అయిన బంగారం విలువ రూ. 3.2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.