ఆరాధన స్థలంలో చోరీ

దిశ, మిర్యాలగూడ: ఆలయంలో చోరీ జరిగిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని గర్భగుడి తాళం పగలకొట్టి అమ్మవారి విగ్రహంపై ఉన్న 12 కిలోల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, హుండీలోని రూ.10 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున గుడి వద్దకు చేరుకున్న పూజారి తాళం పగిలి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. […]

Update: 2020-08-26 03:19 GMT

దిశ, మిర్యాలగూడ: ఆలయంలో చోరీ జరిగిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోని గర్భగుడి తాళం పగలకొట్టి అమ్మవారి విగ్రహంపై ఉన్న 12 కిలోల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, హుండీలోని రూ.10 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున గుడి వద్దకు చేరుకున్న పూజారి తాళం పగిలి ఉండటాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సదా నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News