లాక్‌డౌన్‌లో షాపింగ్ మాల్‌కు కన్నం
దిశ , నిజామాబాద్ సిటీ : లాక్ డౌన్ పకడ్బందీగా అమలు అవుతున్న కాలంలో చోరులు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ సుల్తాన్ షాపింగ్ మాల్‌లో చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం రంజాన్ పండగ ఉండటంతో ఈ సంఘటన శనివారం ఉదయం షాపు తియ్యడంతో వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్ మాల్ పై భాగం నుంచి పిఓపి ని తోలిగించి లోనికి ప్రవేశించారు. షాపింగ్‌మాల్ లోని కౌంటర్ లో ఉన్న […]
దిశ , నిజామాబాద్ సిటీ : లాక్ డౌన్ పకడ్బందీగా అమలు అవుతున్న కాలంలో చోరులు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ సుల్తాన్ షాపింగ్ మాల్‌లో చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం రంజాన్ పండగ ఉండటంతో ఈ సంఘటన శనివారం ఉదయం షాపు తియ్యడంతో వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్ మాల్ పై భాగం నుంచి పిఓపి ని తోలిగించి లోనికి ప్రవేశించారు. షాపింగ్‌మాల్ లోని కౌంటర్ లో ఉన్న లక్ష నగదు ఎత్తుకెళ్లారని మాల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన జరిగిన సుల్తాన్ షాపింగ్ మాల్ కు 200 అడుగుల దూరంలో లాక్‌డౌన్ కు సంబంధించిన పోలీస్ చెక్ పోస్టు ఉండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సిసి కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. దొంగతనం చేసింది ఇంటిదొంగలు అనే అనుమానాలు ఉన్నాయి. తెలిసిన వారే రెక్కి నిర్వహించి పండగ పూట దొంగతనం చేసుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.