Tragic incident:అదుపుతప్పి ఆటో బోల్తా.. బాలుడి మృతి
మండల పరిధిలోని గణేకల్లు గ్రామ సమీపం వద్ద జరిగిన విషాదకర ప్రమాదంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.
దిశ, ఆదోని: మండల పరిధిలోని గణేకల్లు గ్రామ సమీపం వద్ద జరిగిన విషాదకర ప్రమాదంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గణేకల్లు గ్రామానికి చెందిన నాగవేణి, రామాంజనేయులు దంపతుల కుమారుడు అరవింద్ మేనమామ వీరేష్ తో పాటు దైవ దర్శనానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మేనమామ వీరేష్, బాబాయ్ రాజేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.